logo

వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీల బాధ్యతల స్వీకరణ

పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, ఉస్మానియా, జేఎన్‌టీయూ వర్సిటీలకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఇన్‌ఛార్జి వీసీలుగా బుధవారం బాధ్యతలు చేపట్టారు.

Published : 23 May 2024 04:49 IST

ఉస్మానియా వర్సిటీలో బాధ్యతలు స్వీకరిస్తున్న దానకిశోర్‌

లాలాపేట, కూకట్‌పల్లి, నారాయణగూడ, న్యూస్‌టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, ఉస్మానియా, జేఎన్‌టీయూ వర్సిటీలకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఇన్‌ఛార్జి వీసీలుగా బుధవారం బాధ్యతలు చేపట్టారు.  ఉస్మానియా ఇన్‌ఛార్జి ఉపకులపతిగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిశోర్‌ రవీందర్‌ యాదవ్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. జేఎన్‌టీయూ ఇన్‌ఛార్జి  వీసీగా విద్యాశాఖ ముఖ్య  కార్యదర్శి బొర్రా వెంకటేశం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా సాంస్కృతిక, పర్యాటక, యువజన క్రీడా శాఖల ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్‌ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు.


సచివాలయంలో వెంకటేశంకు పుష్పగుచ్ఛం అందిస్తున్న రెక్టార్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని