logo

గ్రంథాలయాలకు సాంకేతిక దన్ను

పరిశోధన సంస్థలు గ్రంథాలయాల నిర్వహణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాయి. సంప్రదాయ నిర్వహణ పద్ధతి స్థానంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్‌ఎఫ్‌ఐడీ) లైబ్రరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అందిపుచ్చుకుంటున్నాయి

Published : 23 May 2024 04:52 IST

ఆర్‌ఎఫ్‌ఐడీ పరిజ్ఞానం వినియోగం

ఎన్‌జీఆర్‌ఐలో ఆధునిక పద్ధతిలో నిర్వహణ

ఆర్‌ఎఫ్‌ఐడీతో ఆధునికీకరించిన గ్రంథాలయాన్ని ఇటీవల ప్రారంభించిన ఎస్‌.ప్రకాశ్‌కుమార్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: పరిశోధన సంస్థలు గ్రంథాలయాల నిర్వహణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాయి. సంప్రదాయ నిర్వహణ పద్ధతి స్థానంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్‌ఎఫ్‌ఐడీ) లైబ్రరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అందిపుచ్చుకుంటున్నాయి. పరిశోధన సంస్థల్లో ల్యాబ్‌లతో పాటూ గ్రంథాలయాలు అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి. ఇందులో జాతీయ, అంతర్జాతీయ పరిశోధనలకు సంబంధించిన పుస్తకాలు వేలు, లక్షల్లో ఉంటాయి. వీటి నిర్వహణ రాన్రాను ఇబ్బందికరంగా మారింది. నగరంలో ఉన్న పలు కేంద్ర పరిశోధన సంస్థల్లో గ్రంథాలయాల నిర్వహణపై శాస్త్రవేత్తల నుంచి ఇటీవల కాలంలో ఫిర్యాదులొచ్చాయి. చాలా వాటిల్లో ఇప్పటికీ పాత విధానంలో నిర్వహిస్తుండటమే కారణం. కొన్నిచోట్ల బార్‌ కోడ్‌ విధానం అందుబాటులోకి తీసుకొచ్చినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. దానికి పరిష్కారంగా ఆర్‌ఎఫ్‌ఐడీని ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌లోని బ్రిటీష్‌ లైబ్రరీలో చానాళ్లక్రితమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. పరిశోధన సంస్థల్లోనూ ఒక్కొక్కటిగా అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ వస్తున్నారు. 

ఎన్‌జీఆర్‌ఐలో సరికొత్తగా 

హబ్సిగూడలోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ)లో హరినారియన్‌ నాలెడ్జి రీసోర్స్‌ సెంటర్‌ పేరుతో గ్రంథాలయం నిర్వహిస్తున్నారు. ఇక్కడ భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి 20వేల పుస్తకాలు ఉన్నాయి. ఇటీవలి వరకు బార్‌కోడ్‌తో జారీ చేసేవారు. ఆర్‌ఎఫ్‌ఐడీ లైబ్రరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌తో అప్‌గ్రేడ్‌ చేయగా.. ఇటీవలే ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రకాశ్‌కుమార్‌ ప్రారంభించారు.
ఇలా పనిచేస్తుంది 

  •  ఎన్‌జీఆర్‌ఐలోని ప్రతి ఉద్యోగికి ఇటీవల చిప్‌ అమర్చిన గుర్తింపు కార్డు ఇచ్చారు. దీన్నే గ్రంథాలయ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.  
  •  ప్రతి పుస్తకానికి చిప్‌ అమర్చారు. దీంతో ఎవరూ కూడా నమోదు చేయించకుండా బయటికి తీసుకెళ్లలేరు. ఒకవేళ వెళితే షాపింగ్‌మాల్‌లో మాదిరి బీప్‌ శబ్దం వస్తుంది. 
  • వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయి కాబట్టి పుస్తకాల వెతుకులాట తప్పుతుంది.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని