logo

సంఖ్యా బలమా.. సంక్లిష్టమా?

శాసనసభ ఎన్నికల సమరం ముగిసింది. సార్వత్రిక పోరు పోలింగ్‌ పూర్తయి ఫలితాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి స్థానిక ఎన్నికలపై పడింది.

Published : 24 May 2024 01:57 IST

అన్ని పార్టీల్లో ప్రాదేశిక కదలికలు
టిక్కెట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు షురూ
న్యూస్‌టుడే, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్‌

శాసనసభ ఎన్నికల సమరం ముగిసింది. సార్వత్రిక పోరు పోలింగ్‌ పూర్తయి ఫలితాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి స్థానిక ఎన్నికలపై పడింది. అధికారులూ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల్లో ప్రాదేశిక కదలికలు ప్రారంభమయ్యాయి. పదవులు ఆశిస్తున్న నేతలు కండువాలు మారుస్తూ టిక్కెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

అధికార కాంగ్రెస్‌కు తలపోటు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండడంతో పదవులపై ఆశలు పెట్టుకున్న చాలా మంది నేతలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటికే ఉన్న పాత నేతలు సైతం పదవులపై ఆశలు పెంచుకున్నారు. టిక్కెట్ల కేటాయింపు సమయంలో ఈ పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీకి ఒకింత ఇబ్బంది తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

వికారాబాద్‌ భారాస పార్టీకి చెందిన పురపాలిక అధ్యక్షురాలు శాసనసభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరగా, భారాసలోని వీరి ప్రత్యర్థి వర్గానికి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు పార్లమెంటు ఎన్నికల తరుణంలో కాంగ్రెస్‌లో చేరారు. జడ్పీ అధ్యక్షురాలితో సహా పార్లమెంటు ఎన్నికల్లో పలువురు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సింగిల్‌విండో ఛైర్మన్లు, తాజా మాజీ సర్పంచులు అధిక మొత్తంలో అధికార పార్టీలో చేరగా, కొంతమంది భాజపాలో చేరారు. పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

భాజపాలో అలా.. భారాసలో ఇలా..

పట్టణాల్లో మున్సిపల్‌ కౌన్సిలర్లుగా పోటీ చేయాలన్న తలంపుతో భాజపాలో చేరిన నాయకులు ఆయా వార్డుల్లో పలు కార్యక్రమాలకు హాజరవుతూ ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. ఎంపీ ఫలితాలు వెలువడి అనుకూల తీర్పు వస్తే మరింత జోరుగా చేరికలు జరుగుతాయి. ఇదే సమయంలో భారాసకు జిల్లాపై పట్టుందని అంచనాలు వేసుకుంటున్న నేతలు ఇప్పటి నుంచే ఆయా స్థానాలపై పరిశీలన చేస్తున్నారు.

జ.టీ.: జడ్పీటీసీలు, ఎం.టీ.: ఎంపీటీసీలు, స.లు.: సర్పంచులు, కౌ.ర్లు.: కౌన్సిలర్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు