logo

భారత్, యూఎస్‌ ద్వైపాక్షిక వాణిజ్యం పెరగొచ్చు

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే ఐదేళ్లలో 500 బిలియన్‌ యూఎస్‌ డాలర్లకు చేరుకోవచ్చని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ అన్నారు.

Updated : 24 May 2024 05:20 IST

 యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌

మాట్లాడుతున్న జెన్నిఫర్‌ లార్సన్, చిత్రంలో ప్రియా గజ్దర్, గారెత్‌ ఓవెన్, డెనీస్‌ ఈటన్‌ 

సోమాజిగూడ, న్యూస్‌టుడే: భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే ఐదేళ్లలో 500 బిలియన్‌ యూఎస్‌ డాలర్లకు చేరుకోవచ్చని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ అన్నారు. గురువారం ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ది పార్కు హోటల్‌లో ‘ప్రపంచ వాణిజ్యం’ అంశంపై జరిగిన సమావేశంలో జెన్నిఫర్‌ లారెన్స్‌ మాట్లాడుతూ.. అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 40 శాతం తెలుగువారేనని, అక్కడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష తెలుగేనని పేర్కొన్నారు. సౌత్‌ ఏషియా ఆస్ట్రేడ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కమిషనర్‌ డెనిస్‌ ఈటన్‌ మాట్లాడుతూ.. భారత్, ఆస్ట్రేలియా సహజ భాగస్వాములని అన్నారు. తెలంగాణ, ఏపీ బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ ఓవెన్‌ మాట్లాడుతూ.. భారత్‌ తమ దేశానికి 12వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని పేర్కొన్నారు. ఫిక్కీ ఛైర్‌పర్సన్‌ ప్రియా గజ్దర్‌ మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని