logo

తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు

తాళం వేసిన మూడిళ్లలో గురువారం రాత్రి చోరీ జరిగింది.

Updated : 25 May 2024 05:22 IST

35 తులాల బంగారం, రూ.2.40లక్షలు అపహరణ

మజీద్‌పూర్‌ ప్రజయ్‌ హోమ్స్‌లో జరిగిన చోరీ తీరును తెలుసుకుంటున్న శామీర్‌పేట పోలీసులు

శామీర్‌పేట, ఘట్‌కేసర్‌: తాళం వేసిన మూడిళ్లలో గురువారం రాత్రి చోరీ జరిగింది. వేర్వేరు ఘటనల్లో 35 తులాల బంగారం, 35 తులాల వెండి, రూ.2.40 లక్షలు ఎత్తుకెళ్లారు. శామీర్‌పేట, పోచారం పోలీసులు క్లూస్‌ టీంతో పరిశోదన చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
ఊరెళితే...: బిజిలి తిరుపతి దంపతులు అన్నోజిగూడలోని సర్వే నంబరు 96లో ఉంటున్నారు. వీరికి యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం రాఘవపురంలో పందుల దొడ్డి ఉంది. గురువారం రాత్రి ఇంటికి తాళం వేసి అక్కడికి వెళ్లారు. తిరిగి శుక్రవారం వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని 16తులాల బంగారం, 35 తులాల వెండి ఆభరణాలు, రూ.1.40లక్షలు పోయాయి.

వేసవి సెలవులకు వస్తే..: శామీర్‌పేట మండలం మజీద్‌పూర్‌ పరిధి ప్రజయ్‌ హోమ్స్‌ కాలనీలో ఉంటున్న శ్రీనివాస్, మహ్మద్‌ రఫీ కుటుంబాలు గురువారం ఊరెళ్లారు. శ్రీనివాస్‌ కుమార్తె వేసవి సెలవులకు ప్రజయ్‌ హోమ్స్‌ వచ్చింది. తల్లిదండ్రులు గుంటూరు వెళ్లడంతో ఇంట్లో ఒక్కరే ఉండలేక తన 19 తులాల బంగారు ఆభరణాలు, నగదును ఇంట్లోనే దాచి పక్కనే ఉన్న సోదరి ఇంట్లో నిద్రపోయింది. దొంగలు తాళం పగలగొట్టి బీరువాలోని బంగారంతోపాటు రూ.లక్ష చోరీ చేశారు. ఇంటి కింది భాగంలో మహ్మద్‌ రఫీ ఇంట్లో చరవాణితోపాటు కొంత నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని