logo

ఎంఎన్‌జేలో ట్విన్‌ టవర్లు!

నగరంలోని ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రి ఎంఎన్‌జేను విస్తరించనున్నారు.

Updated : 25 May 2024 05:16 IST

రూ.110 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు
అదనంగా 500 పడకలు అందుబాటులోకి..

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రి ఎంఎన్‌జేను విస్తరించనున్నారు. ప్రస్తుత ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న స్థలంలో ట్విన్‌ టవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంచేశారు. మొత్తం రూ.110 కోట్లతో కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఫలితంగా అదనంగా 500 పడకలు అందుబాటులోకి రానున్నాయి.  ప్రస్తుతం ఆసుపత్రిలో 750 పడకలున్నాయి. ఏటేటా రోగుల సంఖ్య పెరుగుతోంది. ఎంఎన్‌జేలో అధునాతన సేవలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో అదనపు పడకల అవసరం ఏర్పడుతోంది. ప్రభుత్వం నుంచి లేదా సీఎస్‌ఆర్‌ కింద వివిధ ప్రైవేటు సంస్థలు కూడా అదనపు భవనాలు నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కొత్త భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.

రూ.30 కోట్లతో ట్రూబీమ్‌ థెరపీ

రేడియేషన్‌ చికిత్సల్లో అత్యాధునికమైన ట్రూబీమ్‌ థెరపీ సేవలు సైతం ఎంఎన్‌జేలో అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలి రూ.30 కోట్లతో ఈ-రేడియేషన్‌ యంత్రాన్ని ప్రారంభించారు. ట్రూబీమ్‌తో క్యాన్సర్‌ కణితిని మాత్రమే కచ్చితమైన లక్ష్యంతో లోతుగా ధ్వంసంచేస్తాయి. ఎంఎన్‌జేలో ఈ చికిత్సలు పూర్తి ఉచితంగా అందిస్తుండటంతో రోగులకు ఎంతో ఊరట   కలుగుతుందని, మున్ముందు మరిన్ని చికిత్సలు అందుబాటులోకి రానున్నాయని ఎంఎన్‌జే    డైరెక్టర్‌ ముత్తా శ్రీనివాసులు తెలిపారు.  

ఆసుపత్రి స్వరూపం...

ప్రస్తుతం ఆసుపత్రిలో పడకల సంఖ్య : 750
ఏటా కొత్త క్యాన్సర్‌ కేసుల నమోదు: 15,000
సమీక్షకు వచ్చే కేసులు: 1,50,000
ఏటా మేజర్‌ సర్జరీలు: 4500
మైనర్‌ శస్త్ర చికిత్సలు: 6000
రోజూ రేడియోథెరపీ చికిత్సలు: 300
నిత్యం కీమో థెరపీ చికిత్సలు: 300
ఏటా వివిధ రకాల టెస్టులు: 1.5 లక్షలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని