logo

హోటల్‌లో కుప్పకూలిన లిఫ్టు

ఓ హోటల్‌లోని నాలుగో అంతస్తు నుంచి లిఫ్టు కూలిన ఘటనలో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. నాగోలు ఠాణా పోలీసుల కథనం ప్రకారం.. నాగోలులోని కినరా గ్రాండ్‌ హోటల్‌లో ఆదివారం ఓ  వివాహ నిశ్చితార్ధానికి పలువురు హాజరయ్యారు.

Published : 27 May 2024 03:22 IST

ఎనిమిది మందికి గాయాలు

లిఫ్టును మూసివేసిన దృశ్యం

నాగోలు: ఓ హోటల్‌లోని నాలుగో అంతస్తు నుంచి లిఫ్టు కూలిన ఘటనలో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. నాగోలు ఠాణా పోలీసుల కథనం ప్రకారం.. నాగోలులోని కినరా గ్రాండ్‌ హోటల్‌లో ఆదివారం ఓ  వివాహ నిశ్చితార్ధానికి పలువురు హాజరయ్యారు. అనంతరం నాలుగో అంతస్తు నుంచి లిఫ్టులో కిందకు దిగుతున్నారు. హఠాత్తుగా లిఫ్టు ఒక్కసారిగా కుప్పకూలి సెల్లార్‌లో పడిపోయింది.అందులోని వారంతా తీవ్రంగా గాయపడ్డారు. శుభకార్యానికి హాజరైన మిగతావారు హోటల్‌ యాజమాన్యం సాయంతో లిఫ్టు తలుపు తెరిపించి వారిని ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో వీరభద్రం(32), మణికంఠ గుప్తా(32), మనోహర్‌(32), రవిశంకర్‌రెడ్డి(32), సాజిద్‌ బాబా(32), కల్యాణ్‌కుమార్‌(32)తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. నిర్వహణ లోపంవల్లే లిఫ్టు కూలిందంటూ బాధితుల ఫిర్యాదు మేరకు నాగోలు పోలీసులు హోటల్‌పై కేసు నమోదు చేశారు. పరిమితికి మించి ఎక్కడంవల్లే  కూలినట్లు యాజమాన్యం పేర్కొంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని