logo

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దౌర్జన్యాలు ఖండించాలి

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దురాగతాలను, దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని మాజీ ఎంపీ సయ్యద్‌ అజీజ్‌పాషా పిలుపునిచ్చారు.

Updated : 27 May 2024 05:21 IST

అభివాదం చేస్తున్న ప్రొ.కోదండరాం, అజీజ్‌పాషా, జస్టిస్‌ చంద్రకుమార్, ప్రొ.విశ్వేశ్వరరావు

రాంనగర్,  న్యూస్‌టుడే: పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దురాగతాలను, దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని మాజీ ఎంపీ సయ్యద్‌ అజీజ్‌పాషా పిలుపునిచ్చారు. ఆదివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో ఆల్‌ ఇండియా తంజీమ్‌ ఈ ఇన్సాఫ్‌ ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడులు ఆపాలని డిమాండ్‌ చేశారు. తెజస వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందన్నారు. పాలస్తీనాలోని గాజాపై దాడులు చేయడమే కాకుండా అక్కడి ప్రజలకు ఆహారం, ఇంధనం, నీరు, విద్యుత్‌ లేకుండా చేసి దౌర్జన్యాలకు పాల్పడిందన్నారు. కార్యక్రమంలో జస్టిస్‌ చంద్రకుమార్, ప్రొ.విశ్వేశ్వర్‌రావు, ఉస్మాన్‌ అలీ, అప్జల్, ఖైరుద్దీన్, మునీర్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని