logo

అత్యవసర వైద్యమే ప్రాణాలు కాపాడుతుంది

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రతీ క్షణం విలువైందని, అలాంటి వారికి అత్యవసర విభాగం ప్రాణాల్ని కాపాడుతుందని పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ నగరి బీరప్ప అన్నారు.

Published : 27 May 2024 03:28 IST

సమావేశంలో నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప, ఎమర్జెన్సీ విభాగాధిపతి ఆషిమా శర్మ, వైద్యులు

నిమ్స్, న్యూస్‌టుడే: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రతీ క్షణం విలువైందని, అలాంటి వారికి అత్యవసర విభాగం ప్రాణాల్ని కాపాడుతుందని పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ నగరి బీరప్ప అన్నారు. ప్రపంచ ఎమెర్జెన్సీ మెడిసిన్‌ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆస్పత్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఊహించని ప్రమాదాలకు గురయ్యే వారికి ఎంత తొందరగా వైద్యం అందిస్తే అంతగా ఆరోగ్యపరిస్థితి మెరుగుపరిచేందుకు వీలవుతుందన్నారు.అత్యవసర వైద్య బృందం వారి ప్రాణాల్ని నిలిపేందుకు రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా శ్రమిస్తారని కొనియాడారు.  కొన ఊపిరితో ఉన్న ఎంతో మందికి నిమ్స్‌ ఆస్పత్రి అత్యవసర విభాగం పునర్జన్మ ప్రసాదించిందన్నారు. ఎమర్జెన్సీ విభాగాధిపతి ఆషిమా శర్మ మాట్లాడుతూ.. ఈ విభాగంలో విధులు నిర్వహించే వైద్యులకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఎలా కాపాడుకోవాలో ప్రత్యేకశిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.పలు విభాగాల వైద్యులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని