logo

గర్భిణులూ.. ఆరోగ్యం జాగ్రత్త

తాండూరు, పరిగి, కొడంగల్‌ తదితర ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఈ వాతావరణం గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Published : 27 May 2024 03:33 IST

డాక్టర్‌ మంజుల

న్యూస్‌టుడే, తాండూరు, పరిగి: తాండూరు, పరిగి, కొడంగల్‌ తదితర ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఈ వాతావరణం గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సాధారణంగా గర్భిణుల్లో శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువ. అధిక వేడి కారణంగా గర్భస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఆసుపత్రి గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ మంజుల తెలిపారు. 

పేదలు, కార్మికులకు జిల్లా ఆసుపత్రే ఆధారం

జిల్లాలో తాండూరులో సుద్ద, నాపరాయి పరిశ్రమలు ఎక్కువ. వికారాబాద్, కొడంగల్‌ తదితర ప్రాంతాల్లో కూలీలు,పేద కుటుంబాల వారు అధికంగా ఉన్నారు. ఆర్థికంగా ఉన్న వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో సమయానుకూలంగా చికిత్స పొందుతున్నా పేదలు, కార్మిక కుటుంబాలకు మాత్రం జిల్లా ఆసుపత్రే దిక్కుగా ఉంది. 

  • అధిక వేడి కారణంగా మూడు నెలలు దాటిన వారు సవ్యంగా ఆహారం తీసుకోక పోతే, శరీరంలో నీటి శాతం తగ్గి వాంతులు అవుతాయి.ఈ పరిణామం డీ హైడ్రేషన్‌కు దారితీస్తే ప్రమాదకరం. ఈనేపథ్యంలోనే గర్భస్రావం జరుగుతుంది. అందుకని గర్భిణులు శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవాలని డాక్టర్‌ మంజుల సూచిస్తున్నారు. రక్తపు పోటు, అలసట వంటివి కనిపిస్తే సమీప ఆసుపత్రులకు వెంటనే వెళ్లాలన్నారు. కొన్ని కారణాల వల్ల జిల్లా ఆసుపత్రిలో హైరిస్కు కేసులు నమోదౌతున్నాయని తెలిపారు. 
  • గర్భిణులు  అత్యవసరంగా బయటికి వెళ్లాల్సి వస్తే ఉదయం 11 గంటలలోపు, సాయంత్రం నాలుగు గంటల లోపే వెళ్లాలన్నారు. నాలుగో నెల నుంచి ఉమ్మనీరు ఉత్పత్తి అవుతుంది కాబట్టి శీతల పానీయాలు, కాఫీలు, టీ పూర్తిగా తగ్గించాలన్నారు. మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకుని డీ హైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని కోరారు. 

జిల్లాలో గర్భిణులు: 7,290 మంది
జిల్లా ఆసుపత్రిలో రోజూవారీగా నమోదవుతున్న తీవ్ర ఆరోగ్య సమస్య కేసులు: 8 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు