logo

సందడిగా ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డుల ప్రదానం

రౌండ్‌ టేబుల్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డ్స్‌-2024 పేరిట చేపట్టిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

Published : 27 May 2024 04:06 IST

డాక్టర్‌ రఘురామ్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప, క్రీడాకారులు హితేష్‌ డోల్వాని, అనూప్‌కుమార్‌ యామ

మాదాపూర్, న్యూస్‌టుడే: రౌండ్‌ టేబుల్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డ్స్‌-2024 పేరిట చేపట్టిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఆదివారం రాత్రి మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారికి అవార్డులు అందజేశారు. 12 విభాగాల్లో అచీవర్, ఎమర్జింగ్‌ టాలెంట్‌ పేరిట మొత్తం 24 మందికి ప్రదానం చేశారు. కళలు, సంస్కృతి, చదువు, వినోదం, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్, వైద్యం, ఇన్‌ఫ్రా, ఎన్‌జీవో, రిటైల్, క్రీడలు, స్టార్‌ ఉమెన్, స్టార్‌ కిడ్‌ ఇలా వేర్వేరు రంగాల్లో రాణిస్తున్న వారికి ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ పేరిట అవార్డులు అందజేసి సన్మానించారు. సినీనటుడు అనీష్‌ కురువిల్లా, రొమ్ము క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ రఘురాం ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలకు అవార్డులు బహుకరించారు. కార్యక్రమంలో అవార్డ్స్‌ కమిటీ కన్వీనర్‌ మణిందర్‌ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు. 

దర్శకుడు భాస్కర్, నటుడు అనిష్‌ కురువిల్లా నుంచి అవార్డు అందుకుంటున్న నగేశ్‌ కుకునూరు

ఆకట్టుకున్న చిన్నారుల సంగీత విభావరి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని