logo

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా థియేటర్లు

‘సినీ వినోదాన్ని ఆస్వాదించే విషయంలో ప్రేక్షకుల్లో గొప్ప మార్పు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త సినిమా థియేటర్లు రూపు దిద్దుకుంటున్నాయి.

Published : 28 May 2024 02:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘సినీ వినోదాన్ని ఆస్వాదించే విషయంలో ప్రేక్షకుల్లో గొప్ప మార్పు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త సినిమా థియేటర్లు రూపు దిద్దుకుంటున్నాయి. అపర్ణ సంస్థ సినిమా రంగంలో కొత్త బ్రాండ్‌ని ఆవిష్కరించింది. భవిష్యత్తులో ఆ సంస్థ నుంచి మరిన్ని థియేటర్లు అందుబాటులోకి వస్తాయి’ అన్నారు నిర్మాత ఎన్వీ ప్రసాద్‌. సోమవారం నల్లగండ్లలో అపర్ణ సినిమాస్‌ మల్టీప్లెక్స్‌ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ‘అత్యుత్తమమైన సౌండ్‌ సిస్టమ్, సీటింగ్‌తో అపర్ణ సినిమాస్‌ మల్టీప్లెక్స్‌ని తీసుకొచ్చింది. ఈ నెల 31 నుంచే ఈ థియేటర్లు అందుబాటులోకి వస్తాయి’’ అన్నారు. అపర్ణ సంస్థల ఆపరేషన్స్‌ హెడ్‌ రామకృష్ణ, అపర్ణ సినిమాస్‌ హెడ్‌ ఆపరేషన్స్‌ సునీల్‌ ద్వివేది, మేనేజర్‌ మధుకర్, ప్రోగ్రామింగ్‌ మేనేజర్‌ శివకుమార్‌తోపాటు, సుమిత్, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని