logo

రెస్టారెంట్‌ వంటగదిలో ఎలుక పెంటికలు

డబ్బు కట్టి ఆకలి తీర్చుకునేందుకు వచ్చే వినియోగదారులకు నగరంలోని పలు హోటళ్లు కనీస నాణ్యత పాటించడం లేదు.

Published : 28 May 2024 02:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: డబ్బు కట్టి ఆకలి తీర్చుకునేందుకు వచ్చే వినియోగదారులకు నగరంలోని పలు హోటళ్లు కనీస నాణ్యత పాటించడం లేదు. కొన్ని రోజులుగా తనిఖీల్లో వెలుగు చూస్తున్న దారుణాలే అందుకు నిదర్శనం. వట్టినాగులపల్లిలోని ప్రిజమ్‌ రెస్టారెంట్‌లో అలాంటి ఓ దారుణం వెలుగు చూసినట్లు సోమవారం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల టాస్క్‌ఫోర్స్‌ బృందం ప్రకటించింది. వంట గదిలో ఎలుక పెంటికలున్నాయని, బొద్దింకలు, ఇతర కీటకాలు స్వైర విహారం చేస్తున్నాయని అధికారులు తెలిపారు. మురుగునీరు, గడువు తీరిన ఆహార పదార్థాలు, ఫ్రిజ్‌లో బూజు పట్టిన కూరగాయలను గుర్తించామన్నారు. 

ఇతర హోటళ్లలో గుర్తించినవి..

  • మేడ్చల్‌ తాజా హోటల్‌లో హానికర రంగులు, నాసిరకం నిమ్మకాయలు, కూరగాయలు, దాల్చినచెక్క, టీ పౌడరు, కొర్రలు.
  • కొంపల్లి ట్రెయిన్‌ థీమ్‌ రెస్టారెంట్‌లో బూజుపట్టిన ఉల్లిపాయ, క్యాలిఫ్లవర్‌ మిశ్రమం, మురుగునీటి నిల్వ.
  • ఆయా హోటళ్లలోని పాచిపోయిన, గడువు తీరిన ముడిసరకు, ఇతర పదార్థాలను ధ్వంసం చేశామని, నమూనాలను ప్రయోగశాలకు పంపించామని అధికారులు తెలిపారు. వంట మనుషుల ఆరోగ్య స్థితిగతులను తెలిపే ధ్రువీకరణ పత్రం లేకపోవడం, ఇతరత్రా ఉల్లంఘనలపై నోటీసులిచ్చామని వివరించారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని