logo

రైళ్లలో మత్తుపదార్థాల రవాణా

రైళ్లలో ప్రయాణికుల్లా నటిస్తూ మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ముఠా గుట్టును సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు బట్టబయలు చేశారు.

Published : 28 May 2024 02:36 IST

అంతర్రాష్ట్ర  నిందితుడి అరెస్ట్‌

రెజిమెంటల్‌బజార్‌: రైళ్లలో ప్రయాణికుల్లా నటిస్తూ మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ముఠా గుట్టును సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు బట్టబయలు చేశారు. ఆరుగురు ముఠా సభ్యుల్లో ఒకరిని అరెస్ట్‌ చేశారు. రూ.15.50 లక్షల విలువైన 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో రైల్వే ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్, సారస్వత్, ఎస్సై ఎం.ఏ.మజీద్, హెడ్‌ కానిస్టేబుళ్లు సీతారాములు, నాగుబాషాతో కలసి డీఎస్పీ ఎస్‌.ఎన్‌.జావెద్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన మిహర్, ఛిడా, చంద్‌కుమార్‌నాయక్‌(30), మరో ఇద్దరు కలసి ఒడిశాలోని మోహన ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేస్తుంటారు. దాన్ని రైళ్లలో వివిధ రాష్ట్రాలకు తరలిస్తారు. ఆదివారం ఒడిషా నుంచి మహారాష్ట్రలోని నాంధేడ్‌కు బయల్దేరారు. రైల్వే ఎస్పీ షేక్‌ సలీమా ఆదేశాలతో సోమవారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే పోలీసుల తనిఖీలో చాంద్‌కుమార్‌నాయక్‌ పట్టుబడ్డాడు. అతడి నుంచి 62 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ముఠాలో ఐదుగురు పారిపోయారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు