logo

3 నెలలు.. 172 నకిలీ నోట్లు!

దేశంలోని పలు బ్యాంకుల నుంచి వచ్చిన నోట్ల కట్టల్లో రూ.92వేలు విలువైన 172 దొంగ నోట్లు వచ్చాయని హైదరాబాద్‌ ఆర్బీఐ అధికారులు నగర సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 28 May 2024 02:37 IST

ఆర్బీఐ అధికారుల ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని పలు బ్యాంకుల నుంచి వచ్చిన నోట్ల కట్టల్లో రూ.92వేలు విలువైన 172 దొంగ నోట్లు వచ్చాయని హైదరాబాద్‌ ఆర్బీఐ అధికారులు నగర సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబరు- డిసెంబరు మధ్యలో వచ్చిన అనుమానస్పద నోట్లను ఆర్బీఐ అధికారులు పరిశీలించి నకిలీవిగా గుర్తించారు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, అమలాపురం, కాలికట్, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని పలు బ్యాంకుల నుంచి రూ.100-54, రూ.200-43, రూ.500-48, రూ.2000-27 దొంగనోట్లు ఆర్బీఐకి వచ్చాయి. ఇంత భారీగా నకిలీ నగదు బ్యాంకులకు ఎలా వచ్చింది. ఆయా ఖాతాదారుల వివరాలను గుర్తించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని