logo

రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ప్రహరీ తొలగింపు

బండ్లగూడజాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 28 May 2024 02:39 IST

బండ్లగూడజాగీర్‌: బండ్లగూడజాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు సేకరించింది. సోమవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘దారి మూసేసి.. ధర పెంచేసి’ కథనానికి పురపాలకశాఖకు చెందిన ఉన్నతాధికారులు స్పందించారు. యాదాద్రి కాలనీలో దారిని మూసేసిన స్థిరాస్తి వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని, అధికారులపై విచారణ చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. హుటాహుటిన కార్పొరేషన్‌ యంత్రాంగం ప్రహరీని తొలగించి రహదారిని పునరుద్ధరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు