logo

Crime news: కూతురిని ప్రేమించిన యువకుడిపై తల్లిదండ్రుల దాడి!

కూతురును ప్రేమించిన యువకుడిపై బాలిక తల్లిదండ్రులు దాడి చేసిన ఘటన బండ్లగూడలో చోటుచేసుకుంది.

Updated : 24 May 2024 12:00 IST

బండ్లగూడ: కూతురును ప్రేమించిన యువకుడిపై బాలిక తల్లిదండ్రులు దాడి చేసిన ఘటన బండ్లగూడలో చోటుచేసుకుంది. ఆమె మైనర్ కావడంతో.. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై గతంలో కేసు నమోదైంది. జైలు శిక్ష అనుభవించి అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో యువతితో తల్లిదండ్రులు బలవంతంగా ఫోన్‌ చేయించి అతడిని తమ ఇంటికి రప్పించినట్లు సమాచారం. యువతి మాటలు నమ్మి వారి ఇంటికి వెళ్లిన తనను బంధించి దాడి చేసినట్లు ఆరోపిస్తూ యువకుడు వీడియో విడుదల చేశారు. తనపై దాడి చేసినట్లు అతడు పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో ఘటనాస్థలికి చేరుకుని యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని