logo

Hyd News: ప్రియురాలి ఇంటికెళ్లిన ప్రియుడు.. దొంగ అనుకొని కొట్టిన బాలిక తండ్రి

ప్రియురాలు (మైనర్‌) పిలిచిందంటూ తెల్లవారుజామున ఆమె ఇంట్లోకి వెళ్లిన యువకుడిని దొంగ అనుకుని బాలిక తండ్రి దాడిచేశాడు.

Updated : 25 May 2024 09:57 IST

అబ్దుల్‌ సొహెల్‌ను బయటికి తీసుకొస్తున్న పోలీసు

కేశవగిరి, న్యూస్‌టుడే: ప్రియురాలు (మైనర్‌) పిలిచిందంటూ తెల్లవారుజామున ఆమె ఇంట్లోకి వెళ్లిన యువకుడిని దొంగ అనుకుని బాలిక తండ్రి దాడిచేశాడు. పాతబస్తీ బండ్లగూడ ఠాణా పరిధిలో శుక్రవారం జరిగింది. బండ్లగూడ గౌస్‌నగర్‌లో నివసించే అబ్దుల్‌ సొహెల్‌(25) గ్లాస్‌ ఫిట్టర్‌. పక్క బస్తీకి చెందిన ఓ వ్యక్తి భవనంలో ఏడాది క్రితం గ్లాస్‌ ఫిట్టింగ్‌ పనిచేశాడు. ఆ సమయంలో ఆయన కూతురు(17)ను ప్రేమించాడు. మాయమాటలు చెప్పి బాలికను తీసుకుని వెళ్లిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో బండ్లగూడ పోలీసులు అబ్దుల్‌ సొహెల్‌ను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద రిమాండుకు పంపారు. జైలుకెళ్లి 45 రోజుల తరువాత బయటికొచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. నమాజు కోసం లేచిన బాలిక తండ్రి.. యువకుడిని దొంగ అనుకుని కొట్టి తర్వాత సొహెల్‌గా గుర్తించాడు. భయపడిన యువకుడు మొదటి అంతస్తులోని గదిలోకి వెళ్లి గడియపెట్టుకుని డయల్‌ 100కు ఫోన్‌ చేశాడు. సొహెల్‌ కుటుంబ సభ్యులు, బండ్లగూడ పోలీసులు వెళ్లి యువకుడిని బయటకు తీసుకొచ్చి ఉస్మానియా ఆసుపత్రికి పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు