logo

Rajasingh: రాజాసింగ్‌కు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌

‘‘బుధవారం ఉదయం 9.19 గంటల నుంచి క్రమం తప్పకుండా తన సెల్‌ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్‌ చేస్తూనే ఉన్నారు. చేసిన ప్రతిసారి ఒక్కో నంబరు నుంచి కాల్‌ వస్తోంది. కొన్ని సార్లు వాయిస్‌ మెసేజ్‌ కూడా చేసి బెదిరిస్తున్నారు.

Updated : 30 May 2024 09:00 IST

గోషామహల్, న్యూస్‌టుడే: ‘‘బుధవారం ఉదయం 9.19 గంటల నుంచి క్రమం తప్పకుండా తన సెల్‌ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్‌ చేస్తూనే ఉన్నారు. చేసిన ప్రతిసారి ఒక్కో నంబరు నుంచి కాల్‌ వస్తోంది. కొన్ని సార్లు వాయిస్‌ మెసేజ్‌ కూడా చేసి బెదిరిస్తున్నారు. వచ్చిన కాల్స్‌లో పాలస్తీనాకు చెందిన ఒక తీవ్రవాది ఫొటో, నంబరు స్పష్టంగా కనిపించింది’’ అని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వీడియో విడుదల చేశారు.   దేశంలో స్లీపర్స్‌ సెల్స్‌ పని చేస్తున్నాయని,  హైదరాబాద్‌లో తమ వ్యక్తులు చాలా మంది ఉన్నారని కూడా ఫోన్‌ చేసిన వ్యక్తులు స్పష్టంగా పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.   ఈ కాల్స్‌పై ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. డీజీపీకి కూడా బుధవారం వచ్చిన ఫోన్‌ కాల్స్‌పై ఫిర్యాదు చేశారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని