logo

బలహీన వర్గాలకు విద్యను దూరం చేసేందుకు కుట్ర: ఏబీవీపీ

బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఏబీవీపీ స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీ పృధ్వీ ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

Published : 01 Feb 2023 02:34 IST

ర్యాలీ నిర్వహిస్తున్న ఏబీవీపీ నాయకులు

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఏబీవీపీ స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీ పృధ్వీ ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఠాగూర్‌ ఆడిటోరియంలో ఏబీవీపీ జిల్లా సమావేశాన్ని ప్రొ.శంకర్‌ ప్రారంభించారు. అనంతరం ఠాగూర్‌ ఆడిటోరియం నుంచి ఎన్‌సీసీ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రయత్నించడంతో అనుమతి ఇవ్వకపోవడంతో ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద ప్రధాన రహదారిపైనే సభ నిర్వహించారు. దీంతో ఓయూ నుంచి ట్రాఫిక్‌ను బంద్‌ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం కనీసం మెస్‌ ఫీజులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీలలో ఫీజులను ఇష్టానుసారం పెంచుతున్నారని ఆరోపించారు. ప్రైవేటు కళాశాలలో ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని