logo

ఐదుసార్లు పీడీ యాక్టు.. అయినా దొంగ బుద్ధి మారలేదు!

దొంగతనాలకు ప్పాడుతున్న కరడుగట్టిన నేరస్థుడిని రామచంద్రాపురం పోలీసులు పట్టుకున్నారు. సీఐ సంజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. 

Published : 01 Feb 2023 02:27 IST

రామచంద్రాపురం రూరల్‌, న్యూస్‌టుడే: దొంగతనాలకు ప్పాడుతున్న కరడుగట్టిన నేరస్థుడిని రామచంద్రాపురం పోలీసులు పట్టుకున్నారు. సీఐ సంజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్‌ చిలకలగూడ ప్రాంతానికి చెందిన మంత్రి శంకర్‌.. ఇంటి తాళాలు పగలకొట్టి దొంగతనాలు చేయడంలో ఆరితేరాడు. ఈ నెల 4న హెచ్‌ఐజీ కాలనీలో నివాసం ఉంటున్న నర్సింగరావు ఇంట్లో తెల్లవారుజామున తాళాలు పగలకొట్టి 20 తులాల బంగారం, 12 తులాల వెండి ఆభరణాలు దొంగతనం చేశారు. తెల్లవారుజామున నర్సింగరావు కుమారుడు డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చారు. ప్రధాన తలుపు తాళాలు పగలగొట్టి ఉండటం బీరువాలో నగలు మాయం అయిన వ్యవహారంపై 4న చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలించారు. నిందితుడు మంత్రి శంకరేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతని ఆచూకీలో పుణేలో లభించడంతో వెళ్లి పట్టుకున్నారు. నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

208 కేసుల్లో శిక్ష.. నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో ఐదు పోలీస్‌స్టేషన్లలో 250 కేసులు నమోదయ్యాయి. 208 కేసుల్లో శిక్ష పడింది. చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో శిక్ష అనుభవించాడు. ఇతనిపై ఐదుసార్లు పీడీ యాక్టు ప్రయోగించారు. అయినా శంకర్‌లో మార్పు రాలేదు. చివరిగా సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గత ఏడాది జనవరిలో అరెస్టై డిసెంబరు 10న విడుదల అయ్యాడు. 25 రోజుల కాలవ్యవధిలోనే ఈ ఏడాది జనవరిలో దొంగతనం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని