logo

మోత మోగుతోంది

పరిమితికి మించిన ధ్వనితో నగరవాసుల గూబ గుయ్‌మంటోంది. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, నివాసాలున్న సున్నిత ప్రాంతాల్లోనూ ఏడాది పొడవునా మోత మోగుతోంది.

Published : 03 Feb 2023 01:44 IST

ఐటీ కారిడార్‌లో పరిమితికి మించి పెరిగిన శబ్ద కాలుష్యం

ఈనాడు, హైదరాబాద్‌: పరిమితికి మించిన ధ్వనితో నగరవాసుల గూబ గుయ్‌మంటోంది. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, నివాసాలున్న సున్నిత ప్రాంతాల్లోనూ ఏడాది పొడవునా మోత మోగుతోంది. ఐటీ పరిశ్రమలు, నివాస ప్రాంతాలున్న గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా ధ్వని కాలుష్యం మోతాదుకు మించుతోంది. జూబ్లీహిల్స్‌, తార్నాక వంటి నివాస ప్రాంతాల్లో, అబిడ్స్‌, జేఎన్టీయూ, ప్యారడైజ్‌ వాణిజ్య ప్రాంతాల్లో, సనత్‌నగర్‌, జీడిమెట్ల, గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతాల్లో, జూపార్కు, గచ్చిబౌలి సున్నిత ప్రాంతాల్లో ధ్వని కాలుష్యాన్ని పీసీబీ నమోదు చేస్తోంది. ఏడాది పొడవునా ఐటీ కారిడార్‌లో ఇదే పరిస్థితి.

కారణాలివీ...

ఐటీ కారిడార్‌లో పబ్బుల హోరు, నిర్మాణ రంగ పనులు, భారీ ట్రక్కుల వాహనాల డ్రైవర్లు నిరంతరాయంగా హారన్లు మోగిస్తున్నారు. అధిక సీసీ వాహనాలను మాడిఫై చేయించి రాత్రివేళ హల్‌చల్‌ చేస్తూ నివాస ప్రాంతాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

ఇలా చేయొచ్చు..

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఏ వ్యక్తి అయినా 8 గంటలపాటు 85 డెసిబుల్స్‌కి మించిన శబ్దాలు వినకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇయర్‌ ప్లగ్‌లు వాడటం, చెవిలో దూది పెట్టుకోవడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని