కళ్లలోనూ క్యాన్సర్ ముప్పు!
రకరకాల క్యాన్సర్ల గురించి చాలామందికి అవగాహన ఉండటం సహజమే. అయితే కళ్లకు కూడా క్యాన్సర్ సోకుతుందనేది చాలా తక్కువ మందికే తెలుసు.
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో 25 వేల కేసులు
నేడు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినం
ఈనాడు, హైదరాబాద్: రకరకాల క్యాన్సర్ల గురించి చాలామందికి అవగాహన ఉండటం సహజమే. అయితే కళ్లకు కూడా క్యాన్సర్ సోకుతుందనేది చాలా తక్కువ మందికే తెలుసు. ప్రభుత్వ కంటి ఆసుపత్రి అయిన సరోజనిదేవితో పాటు ఎల్వీప్రసాద్ నేత్ర వైద్యశాలకు తరచూ ఇలాంటి కేసులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎల్వీ ప్రసాద్‌లో ఇప్పటివరకు 25 వేల కేసులకు చికిత్స అందించారు. శనివారం ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఏ వయసు వారైనా.. కంటి క్యాన్సర్ నేత్రాల చుట్టూ ఉన్న కణజాలం, కనురెప్పలు, కళ్లను రక్షించే పల్చటి పొర (కంజంక్టివా)ల్లో వచ్చే అవకాశం ఉంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువుల నుంచి పెద్ద వాళ్ల వరకు ముప్పు ఉంది. మొదటి దశలోనే గుర్తించి చికిత్స అందించకపోతే కంటి చూపే కాకుండా ప్రాణాల మీదకు వస్తుందని చెబుతున్నారు. కంటి చుట్టూ, లోపల కణుతులు ఉంటే.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కంటి క్యాన్సర్‌కు సరైన కారణాలు లేనప్పటికీ.. ధూమపానం, వైరస్ ఇన్ఫెక్షన్లు, అల్ట్రా వయలెట్ కాంతికి ఎక్కువ సార్లు బహిర్గతం కావడం వల్ల సోకవచ్చంటున్నారు.
లక్షణాలు ఇవి.. క్యాన్సర్ ముప్పు ఉంటే కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. లక్షణాలు కన్పిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా నేత్ర వైద్యుడ్ని కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
* కన్ను ఉబ్బడం * వాచిన కనురెప్పలు లేదా కనురెప్పల పరిమాణం పెరగడం * కళ్ల పరిమాణంలో వ్యత్యాసం * కంటిలో తెల్లని ప్రతిబింబం * కంటిలో పెరుగుతున్న నల్లని మచ్చలు * కళ్లు ఎర్రబడటంతో పాటు నొప్పి * అస్పష్టమైన చూపు లేదా పాక్షికంగా, పూర్తిగా చూపు కోల్పోవడం
తొలి దశలో గుర్తిస్తే మేలు
-డాక్టర్ స్వాతి కలికి, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి
ఏ క్యాన్సర్ అయినా తొలి దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా చూపు పోకుండా చూడొచ్చు. ఇంట్లో ఎవరికైనా కంటి క్యాన్సర్ ఉంటే.. అంతా క్రమబద్ధంగా పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ రోగి ఏ దశలో ఆసుపత్రికి వచ్చారనే దానిపై ఆధారపడి చికిత్స ఉంటుంది. చిన్న కణితులకు లేజర్‌తో చికిత్స అందిస్తారు. పెద్ద కణుతులకు శస్త్రచికిత్స అవసరం కావొచ్చు. ఇంకా ఎక్కువ ఉంటే కీమోథెరపీ, కొన్నిసార్లు రేడియో థెరపీతో తొలగించాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/03/2023)
-
Movies News
Brahmanandam: ఏ జీవిగా పుట్టించినా నవ్వించాలనే కోరుకుంటా: బ్రహ్మానందం
-
Movies News
Kangana Ranaut: ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి: కంగనా రనౌత్
-
Politics News
New Front: నవీన్ పట్నాయక్‌తో మమత భేటీ.. కూటమిపై చర్చించారా..?
-
Sports News
Wasim Jaffer: సూర్యకుమార్‌కు బదులు సంజూ శాంసన్‌ని తీసుకోండి: వసీం జాఫర్
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్