స్థల వివాదంలో స్థిరాస్తి వ్యాపారి హత్య
స్థల వివాదంలో ఓ స్థిరాస్తి వ్యాపారి హత్యకు గురయ్యారు. బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
మూసా సిద్ధిఖి
కార్ఖానా, న్యూస్‌టుడే: స్థల వివాదంలో ఓ స్థిరాస్తి వ్యాపారి హత్యకు గురయ్యారు. బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. ఓల్డ్‌బోయిన్‌పల్లి దిల్‌కుష్‌నగర్‌కు చెందిన మూసా సిద్ధిఖి(43) స్థిరాస్తి వ్యాపారి. బార్కాస్‌కు చెందిన ఫయాజుద్దిన్(42) శంషాబాద్ సమీపంలోని 1200 గజాల స్థలానికి సంబంధించి మూసా సిద్ధిఖికి రూ.50లక్షలు ఇచ్చాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 7గంటల సమయంలో ఫయాజుద్దిన్ దిల్‌కుష్‌నగర్‌లో ఉంటున్న మూసా సిద్ధిఖి ఇంటికి వచ్చాడు. అక్కడ ఇద్దరికి స్థలం విషయంలో మరోసారి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఫయాజుద్దిన్ రాడ్‌తో మూసా సిద్ధిఖి తలపై బలంగా కొట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో తల, కాళ్లపై ఇష్టానుసారంగా పొడిచాడు. దీంతో తీవ్రగాయాలపాలైన సిద్ధిఖిని స్థానికులు చికిత్స నిమిత్తం సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi : రాహుల్‌పై వేటు నిలబడుతుందా..
-
Ap-top-news News
Vande Bharat Express : తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Crime News
చిలుక వాంగ్మూలంతో.. హత్యకేసు నిందితులకు జీవితఖైదు
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్‌సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం