logo

అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు.. నిండు గర్భిణి, మరో బాలుడి మృతి

వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో నిండు గర్భిణితో పాటు ఐదేెళ్ల బాలుడు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

Published : 20 Mar 2023 01:46 IST

కడుపులోనే  కన్ను మూసిన కవలలు
ఆరుగురికి గాయాలు

యాచారం, న్యూస్‌టుడే: వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో నిండు గర్భిణితో పాటు ఐదేెళ్ల బాలుడు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా యాచారం ఠాణా పరిధిలో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం ఒడ్డెపల్లికి చెందిన పాస్టర్‌ అరుణ్‌కుమార్‌, రీతు(22) దంపతులు, మరో పాస్టర్‌ సుందర్‌, రాధిక దంపతులు వీరి సంతానం శ్యాం(5), బ్లెస్సీ(3)లతో పాటు వారి బంధువులు జంగమ్మ, ఇస్తారి జీవనోపాధి కోసం నగరంలో నివాసం ఉంటున్నారు. అరుణ్‌కుమార్‌ కారులో వీరంతా ఆదివారం స్వగ్రామం ఒడ్డెపల్లి చర్చికి వెళ్లారు. సాయంత్రం నగరానికి  తిరిగి వస్తుండగా మాల్‌ మార్కెట్‌ సమీపంలో వీరి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన వీరిని నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో 9 నెలల గర్భిణి రీతు, బాలుడు శ్యామ్‌ మృతి చెందారు. రీతు గర్భంలోని కవలలు కూడా మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. గాయపడిన ఆరుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో బ్లెస్సీ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. యాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని