logo

బాటసింగారానికి పండ్ల బాట

రంజాన్‌ మాసం గురువారం నుంచి మొదలవుతున్న వేళ.. మార్కెట్లలో పండ్ల కళ కనిపిస్తోంది. రకానికో పండు నోరూరిస్తున్నాయి.

Published : 23 Mar 2023 02:56 IST

ఈనాడు-హైదరాబాద్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌-న్యూస్‌టుడే

మార్కెట్‌లో పండ్ల విక్రయాలు

రంజాన్‌ మాసం గురువారం నుంచి మొదలవుతున్న వేళ.. మార్కెట్లలో పండ్ల కళ కనిపిస్తోంది. రకానికో పండు నోరూరిస్తున్నాయి. పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షల అనంతరం తీసుకునే ఆహారంలో వీటికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ధరలు ఎలా ఉన్నా మార్కెట్లలోకి ఫలాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నగరానికి ప్రధాన మార్కెట్‌గా ఉన్న బాటసింగారానికి గత నాలుగైదు రోజులుగా పండ్ల రాక అధికమైంది. ఇఫ్తార్‌ విందులో ప్రముఖమైన ఖర్జూరంతో పాటు పుచ్చకాయలు, ఖర్బూజ, మామిడి, మోసంబి, బాప్పాయి తదితర రకాల విక్రయాలు ఇప్పటికే బాటసింగారంలోని మార్కెట్‌లో జోరుగా సాగుతున్నాయి.

భారీగా దిగుమతి.. బాటసింగారం పండ్ల మార్కెట్‌కు ముంబాయి నుంచి ఖర్జూర భారీగా దిగుమతి అవుతోంది. ఫిబ్రవరి, మార్చి నెల(20వ తేదీ వరకు) సుమారు 389 క్వింటాళ్లు వచ్చింది. గతేడాది ఇదే సమయంలో కేవలం 54 క్వింటాళ్లు మాత్రమే మార్కెట్‌కు వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది ధర సగటున క్వింటాలుకు రూ.1680 ఉండగా.. ఈ ఏడాది ప్రస్తుతం రూ.2800లు పలుకుతోంది. ఏటేటా ఖర్జూర విక్రయాలు పెరుగుతుండటంతో దిగుమతులు కూడా అంతే స్థాయిలో ఉంటున్నాయి. నగరంలో ఇప్పటికే రిటైలర్లు క్వింటాళ్ల కొద్దీ తీసుకెళ్లి అమ్మకాలు చేస్తున్నారని పలువురు హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి.. బాటసింగారంలోని పండ్ల మార్కెట్‌కు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు అనంతపురం, నల్గొండ, కర్నూలు ప్రాంతాల నుంచి పుచ్చకాయలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ ఏడాది ఇప్పటికే వేలాది క్వింటాళ్లు విక్రయలు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని