logo

గోల్డ్‌ ట్రేడింగ్‌లో లాభాలిస్తామని రూ.37 లక్షలకు టోకరా

గోల్డ్డ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పేరుతో రూ.37 లక్షలు దండుకున్నారంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 26 Mar 2023 02:04 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: గోల్డ్డ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పేరుతో రూ.37 లక్షలు దండుకున్నారంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మారావునగర్‌కు చెందిన ఓ వ్యాపారికి టెలిగ్రామ్‌లో యూకేలోని వరల్డ్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ సభ్యురాలినంటూ అవిలా పేరుతో మహిళ పరిచయమైంది. బంగారంపై పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఇస్తామని నమ్మించింది. ముందుగా కొంత లాభాలిచ్చి తర్వాత రూ.37 లక్షలు కొట్టేశారు. యాప్‌లో లాభాలు కనిపిస్తున్నా విత్‌డ్రా అవకాశం లేకుండా చేశారు. బాధితుడు సైబర్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

* చిక్కడపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి ఓ వ్యక్తి వాట్సాప్‌ కాల్‌ చేశాడు. ముందు కొంత డబ్బు పెట్టి, తాము చెప్పిన సినిమాలకు రేటింగ్‌లు ఇస్తే లాభాలిస్తానని రూ.16 లక్షలు కాజేశాడు. బాధితుడు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని