logo

శ్రీరామ నవమి వేడుకలకు సిద్ధం

జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజక వర్గాల్లో నేటి శ్రీరామ నవమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి

Published : 30 Mar 2023 02:27 IST

ఇందిరానగర్‌లోని వరసిద్ధి వినాయక ఆలయం

తాండూరు టౌన్‌: జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజక వర్గాల్లో నేటి శ్రీరామ నవమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. పలుచోట్ల చలువ పందిళ్లు వేసి భక్తులకు తాగునీటి వసతి కల్పిస్తున్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరానగర్‌, ఆదర్శ తులసీనగర్‌, సాయిపూరు, మల్‌రెడ్డిపల్లి, పాత తాండూరు తదితర ప్రాంతాల్లోని దేవాలయాల్లో సీతారాముల కల్యాణానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని