logo

నాది హామీ.. రానుంది సునామీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మంగళవారం పార్టీ  ఆధ్వర్యంలో నిర్వహించిన వేర్వేరు సమావేశాలు, రోడ్‌షోలలో  పాల్గొన్నారు. యూసుఫ్‌గూడలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆటో, క్యాబ్‌డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌, జీహెచ్‌ఎంసీ కార్మికులతో మాట్లాడిన ఆయన అక్కడి నుంచి ఆటోలో నాంపల్లి గోకుల్‌ నగర్‌ క్రాస్‌రోడ్స్‌ చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు.

Published : 29 Nov 2023 04:34 IST

నాంపల్లిలో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న రాహుల్‌, చిత్రంలో పార్టీ అభ్యర్థి ఫిరోజ్‌ ఖాన్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మంగళవారం పార్టీ  ఆధ్వర్యంలో నిర్వహించిన వేర్వేరు సమావేశాలు, రోడ్‌షోలలో  పాల్గొన్నారు. యూసుఫ్‌గూడలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆటో, క్యాబ్‌డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌, జీహెచ్‌ఎంసీ కార్మికులతో మాట్లాడిన ఆయన అక్కడి నుంచి ఆటోలో నాంపల్లి గోకుల్‌ నగర్‌ క్రాస్‌రోడ్స్‌ చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమావ్యక్తం చేశారు.


గాలిపటమా పద పద..

చార్మినార్‌ సమీప ఖిల్వత్‌ప్లేగ్రౌండ్‌లో నిర్వహించిన మజ్లిస్‌ ఎన్నికల ప్రచారం ముగింపు సభలో ప్రసంగిస్తున్న పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. చిత్రంలో పార్టీ అభ్యర్థులు అక్బరుద్దీన్‌ ఒవైసీ, జుల్ఫికర్‌ అలీఖాన్‌.


కారు.. ముమ్మారు

ప్రచారంలో చివరి రోజు భారాస నేతలు నగరమంతటా ర్యాలీలు నిర్వహించారు. బోయిగూడ ఐడీహెచ్‌ కాలనీ నుంచి నిర్వహించిన ప్రదర్శనలో శ్రేణులతో కలిసి పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని