logo

ఓటరు ఐడీ లేకున్నా.. ఓటేయొచ్చు

రాజధానిలోని మూడు జిల్లాల పరిధిలో కోటి 8లక్షల మంది ఓటర్లున్నారు. ప్రతి ఒక్కరూ గురువారం జరగనున్న ఎన్నికలో పాల్గొంటే.. డిసెంబరు 3న వెలువడనున్న ప్రజాతీర్పులో భాగమవుతారు. ఓటరు గుర్తింపు కార్డు లేదని, బూత్‌ లెవల్‌ అధికారుల నుంచి ఓటరు సమాచార చీటీ అందలేదని చాలా మంది ఎన్నిక రోజున ఇంట్లో ఉండిపోతారు.

Published : 29 Nov 2023 04:39 IST

జె.శంకరయ్య

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలోని మూడు జిల్లాల పరిధిలో కోటి 8లక్షల మంది ఓటర్లున్నారు. ప్రతి ఒక్కరూ గురువారం జరగనున్న ఎన్నికలో పాల్గొంటే.. డిసెంబరు 3న వెలువడనున్న ప్రజాతీర్పులో భాగమవుతారు. ఓటరు గుర్తింపు కార్డు లేదని, బూత్‌ లెవల్‌ అధికారుల నుంచి ఓటరు సమాచార చీటీ అందలేదని చాలా మంది ఎన్నిక రోజున ఇంట్లో ఉండిపోతారు. ఈ నేపథ్యంలో.. ఓటరు కార్డు లేకపోయినా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అదనపు కమిషనర్‌ జె.శంకరయ్య మంగళవారం ప్రకటించారు. ఓటరు గుర్తింపు కార్డుకు బదులుగా.. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో.. ఏదో ఒక కార్డుతో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలని, దాని ఆధారంగా పోలింగ్‌ కేంద్రంలోని ఓటరు జాబితాలో పేరును పరిశీలించి ఓటుకు అవకాశం కల్పిస్తారని వెల్లడించారు.  

12 రకాల గుర్తింపు   కార్డులు ఇవే..

ఆధార్‌కార్డు, భారత పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డు, బ్యాంకు లేదా పోస్టాఫీసు పాసుపుస్తకాలు, పాన్‌కార్డు, రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌జీఐ) జారీ చేసిన స్మార్ట్‌కార్డు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్డు, కార్మికశాఖ జారీ చేసే ఆరోగ్యకార్డు, పింఛను పుస్తకం, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతరులకు ఇచ్చే గుర్తింపు కార్డు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని