logo

‘ఓటరు స్లిప్పు’ అందలేదా..ఇలా చేయండి

మరికొన్ని గంటల్లో ఎన్నికల పోలింగ్‌ జరగబోతుంది. ఈ సమయంలో కొందరికి ఓటర్లకు ‘స్లిప్పు’లు అందకపోయి ఉండొచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి ఓటింగ్‌కు దూరంగా ఉండటం సబబు కాదు.

Updated : 29 Nov 2023 06:24 IST

మూసాపేట, న్యూస్‌టుడే: మరికొన్ని గంటల్లో ఎన్నికల పోలింగ్‌ జరగబోతుంది. ఈ సమయంలో కొందరికి ఓటర్లకు ‘స్లిప్పు’లు అందకపోయి ఉండొచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి ఓటింగ్‌కు దూరంగా ఉండటం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. అందుకు రకరకాల మార్గాలను ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది.

  • ఎస్‌ఎంఎస్‌ ద్వారా: ఓటరు గుర్తింపు కార్డు నంబరును 1950, 92117 28082 నంబర్లకు పంపిస్తే మీ పోలింగ్‌ కేంద్రం వివరాలు సంక్షిప్త సమాచారం (ఎస్‌ఎంఎస్‌) రూపంలో లభిస్తాయి.
  • టోల్‌ ఫ్రీ నంబరు: 24 గంటల పాటు పనిచేసే టోల్‌ఫ్రీ నంబరు 1950కు ఫోన్‌ చేసి ఓటరు గుర్తింపు కార్డు నంబరు సాయంతో పోలింగ్‌ కేంద్రం, బూత్‌ నంబరు, క్రమ సంఖ్య వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
  • యాప్‌: ‘ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌’డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు పొందొచ్చు.
  • అంతర్జాలం:ఎన్నికల కేంద్రం వెబ్‌సైట్‌ www.ceotelangana.nic.in ద్వారా పోలింగ్‌ కేంద్రాల చిరునామాలు, వాటి ఫొటోలు, గూగుల్‌ మ్యాప్‌ వివరాలు చూసుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని