logo

మాటల్లేవ్‌.. నోటు బాటే

ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో అభ్యర్థులు తుది వ్యూహాల అమలుకు తెరతీశారు. ప్రతి అభ్యర్థి పోలింగ్‌ బూత్‌ పరిధిలోని కాలనీలపై దృష్టిసారించారు. ఈ రెండు రోజులు కొంతమంది ఓటర్లకు నగదు పంపిణీపై దృష్టిపెడితే దీన్ని అడ్డుకోవడానికి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు సిద్ధమయ్యారు.

Updated : 29 Nov 2023 06:52 IST

తుది  వ్యూహాలతో సిద్ధమైన  అభ్యర్థులు
ప్రత్యర్థిని అడ్డుకునేందుకు యత్నం

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో అభ్యర్థులు తుది వ్యూహాల అమలుకు తెరతీశారు. ప్రతి అభ్యర్థి పోలింగ్‌ బూత్‌ పరిధిలోని కాలనీలపై దృష్టిసారించారు. ఈ రెండు రోజులు కొంతమంది ఓటర్లకు నగదు పంపిణీపై దృష్టిపెడితే దీన్ని అడ్డుకోవడానికి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. దీంతో కొన్ని చోట్ల నగదు పంచుతున్న కార్యకర్తలను పట్టుకోవడంతో గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది అభ్యర్థులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటర్లతో మరోసారి మాట్లాడి వారితో తుది హామీ తీసుకోవాలని కోరుతున్నారు.

చివరి వరకు విశ్రమించొద్దని..

ప్రచారం ముగిసినా మంగళవారం రాత్రి నుంచి పోలింగ్‌ పూర్తయ్యే వరకు అభ్యర్థులు విశ్రమించవద్దని ప్రధాన పార్టీల అగ్రనేతలు ఆదేశించారు. దీంతో నియోజకవర్గంలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే దిశలో అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజులుగా కొన్ని చోట్ల అడపాదడపా ఓటర్లకు నగదు పంపిణీ మొదలైంది. ఓటర్ల జాబితా ఆధారంగా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటుకు రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారు. దీన్ని ప్రత్యర్థులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల తరఫున ఇంటింటికి మరోసారి ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని