logo

కాంగ్రెస్‌ మాటలతో మోసపోకండి: అంజయ్యయాదవ్‌

అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎన్నికల వేళ గ్యారంటీలంటూ చెబుతున్న కాంగ్రెస్‌ మాయమాటలతో మోసపోవద్దని షాద్‌నగర్‌ భారాస అభ్యర్థి అంజయ్యయాదవ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ వస్తే ఆగమయ్యే పరిస్థితులు వస్తాయంటూ ఆనాడు అవహేళన చేసినవారే, నేడు అభివృద్ధిని చూసి నోరుమెదపడం లేదన్నారు.

Published : 29 Nov 2023 04:54 IST

కేశంపేటలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

కేశంపేట, న్యూస్‌టుడే: అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎన్నికల వేళ గ్యారంటీలంటూ చెబుతున్న కాంగ్రెస్‌ మాయమాటలతో మోసపోవద్దని షాద్‌నగర్‌ భారాస అభ్యర్థి అంజయ్యయాదవ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ వస్తే ఆగమయ్యే పరిస్థితులు వస్తాయంటూ ఆనాడు అవహేళన చేసినవారే, నేడు అభివృద్ధిని చూసి నోరుమెదపడం లేదన్నారు. మంగళవారం కేశంపేట మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు, మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షాద్‌నగర్‌కు ఐటీహబ్‌ రానుండటంతో ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు. ఎవరో ఇచ్చే ప్రలోభాలకు లోనై భవిష్యత్తును పాడుచేసుకోవద్దని మహిళలకు హితవు పలికారు. కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధి చేసిన తనను మళ్లీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నాయకులు నారాయణరెడ్డి, విశ్వనాథం, వెంకట్‌రెడ్డి, శ్రీలత, శ్రీనివాసులు, మురళీధర్‌రెడ్డి, లక్ష్మినారాయణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని