logo

షాద్‌నగర్‌లో255 పోలింగ్‌ కేంద్రాలు

ప్రచార ఘట్టం ముగిసిపోవడంతో అధికారులు ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉగ్యోగులకు స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు.

Published : 29 Nov 2023 04:58 IST

షాద్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రచార ఘట్టం ముగిసిపోవడంతో అధికారులు ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉగ్యోగులకు స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈఆర్వో వేణు మాధవరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఏసీపీ రంగస్వామి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఎన్నికల నిర్వహణలో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను ఇప్పటికే పట్టణ మినీ స్టేడియంలో భద్రపరిచారు. నియోజకవర్గంలో మొత్తం 2,36,338 మంది ఓటర్లు ఉండగా 255 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 1100 మంది పోలింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక బందోబస్తు నిమిత్తం 500 మంది పోలీసు సిబ్బంది, 76 మంది ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించారు.


‘బార్‌ అసోసియేషన్‌ మద్దతు ఏ పార్టీకీ లేదు’

షాద్‌నగర్‌, న్యూస్‌టుడే: తమ మద్దతు ఏ పార్టీకీ లేదని షాద్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి తెలిపారు. భారాసకు మద్దతిస్తున్నట్లు రెండు రోజుల క్రితం అధ్యక్షుడు వేణుగోపాల్‌రావు, మాజీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వారు మంగళవారం మరో ప్రకటన చేశారు. అసోసియేషన్‌లో న్యాయవాదులు వ్యక్తిగతంగా రాజకీయ పార్టీలకు మద్దతుగా ఉండడం, లేదా స్వతహాగా ఎన్నికల్లో నిలబడడం జరుగుతుందన్నారు. కాబట్టి అధ్యక్షుడి ప్రకటనను వ్యక్తిగత ప్రకటనగానే భావించాలన్నారు. అసోసియేషన్‌ మాత్రం ఎవరికీ మద్దతుగా ఉండబోదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని