logo

చిరుధాన్యాలకు పూర్వ వైభవం తేవాలి

రైతులే నిజమైన కథానాయకులు, ఆరుగాలం కష్టపడే శ్రమజీవులని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. భారతీయ ప్రాచీన సంప్రదాయ చిరుధాన్యాలకు పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా రైతులు తమ వంతు కృషిచేయాలని సూచించారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు మంగళవారం ముగిసింది.

Published : 29 Nov 2023 05:02 IST

ప్రసంగిస్తున్న గవర్నర్‌ తమిళిసై

మాదాపూర్‌, న్యూస్‌టుడే: రైతులే నిజమైన కథానాయకులు, ఆరుగాలం కష్టపడే శ్రమజీవులని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. భారతీయ ప్రాచీన సంప్రదాయ చిరుధాన్యాలకు పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా రైతులు తమ వంతు కృషిచేయాలని సూచించారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు మంగళవారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గవర్నర్‌ మాట్లాడుతూ.. వరి, ఇతర వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా వర్షాధార ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో చిరుధాన్యాల పంటల సాగు చేసి పర్యావరణహితం కోసం రైతులు కృషి చేయాలన్నారు.  చిరుధాన్యాల్లోని పోషకాలు ఆరోగ్య సంరక్షణకు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు.  జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్‌ తారా సత్యవతి మాట్లాడారు. చిరుధాన్యాల పంట సాగులో సుస్థిర పద్ధతులను అనుసరిస్తున్న రైతులు,   ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌, మార్కెటింగ్‌లో రాణిస్తున్న ప్రతినిధులకు, అంకుర సంస్థల నిర్వహకులకు, మహిళా బృందాలకు పురస్కారాలు అందజేశారు.  ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వికాస్‌భాటియా, భారత వ్యవసాయ పరిశోధన మండలి క్రాప్‌ సైన్స్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డా.టి.ఆర్‌.శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని