logo

ఇన్‌స్పెక్టర్‌ నుంచి రూ.6 లక్షల స్వాధీనం

నగర శివారు మేడిపల్లిలో ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రూ.6 లక్షల నగదుతో సోమవారం సాయంత్రం పట్టుబడటం కలకలం రేపుతోంది.   ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ డబ్బు ఎలా పంపిణీ చేస్తారంటూ కొందరు ఇన్‌స్పెక్టర్‌పై చేయిచేసుకున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

Updated : 29 Nov 2023 06:51 IST

ఇన్‌స్పెక్టర్‌ను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఈనాడు, హైదరాబాద్‌: నగర శివారు మేడిపల్లిలో ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రూ.6 లక్షల నగదుతో సోమవారం సాయంత్రం పట్టుబడటం కలకలం రేపుతోంది.   ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ డబ్బు ఎలా పంపిణీ చేస్తారంటూ కొందరు ఇన్‌స్పెక్టర్‌పై చేయిచేసుకున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఆబ్కారీ శాఖ వరంగల్‌(పట్టణ) ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అంజిత్‌రావు సోమవారం మధ్యాహ్నం మేడిపల్లిలోని ఎస్‌వీఎం గ్రాండ్‌ హోటల్‌కు వచ్చారు. ఇదే సమయంలో హోటల్‌ బయట ఉన్న కాంగ్రెస్‌ నేతలు చేతిలో సంచితో వెళ్తున్న ఇన్‌స్పెక్టర్‌ను గమనించారు. అటకాయించి రోడ్డుపై కారును అడ్డుకున్నారు. కారులో తనిఖీ చేయగా రూ.6 లక్షల నగదు వెలుగు చూసింది. ఒక పార్టీ నాయకుల ఆదేశాల ప్రకారమే ఇన్‌స్పెక్టర్‌ తరలిస్తున్నారని, బోడుప్పల్‌లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్నారని కాంగ్రెస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు. గుర్తింపు కార్డు స్వాధీనం చేసుకున్నారు. కొందరు ఇన్‌స్పెక్టర్‌పై చేయిచేసుకున్నారు.  దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇంట్లో వేడుక కోసం హాలు బుక్‌ చేసేందుకు ఇన్‌స్పెక్టర్‌ అంజిత్‌రావు ఎస్‌వీఎం గ్రాండ్‌ హోటల్‌కు వచ్చారని.. తిరిగి వరంగల్‌కు వెళ్లే క్రమంలో డబ్బు వెలుగుచూసిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని