logo

మేయర్‌ తోడు.. మెజార్టీ నాదే!

ఫిలింనగర్‌ నుంచి చేపట్టిన ర్యాలీలో బైక్‌పై వెనుక మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ముందు భారాస అభ్యర్థి దానం నాగేందర్‌

Published : 29 Nov 2023 05:17 IST

ఫిలింనగర్‌ నుంచి చేపట్టిన ర్యాలీలో బైక్‌పై వెనుక మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ముందు భారాస అభ్యర్థి దానం నాగేందర్‌


 తరలొచ్చిన శ్రేణుల్‌.. నాదే ఉప్పల్‌

 

ఏఎస్‌ రావు నగర్‌ నుంచి ఉప్పల్‌ వరకు కార్యకర్తలు, అభిమానులతో కలిసి  పెద్ద ఎత్తున చేపట్టిన ప్రదర్శనలో ఉప్పల్‌ భారాస అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి


మీ సహకారం..  గెలుపు సవారీ

సీతాఫల్‌మండీ కార్పొరేటర్‌ హేమ స్కూటర్‌ నడపగా కూర్చొని బైకు ర్యాలీలో పాల్గొన్న సికింద్రాబాద్‌  భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్‌


పతంగులం.. మేం ఫిరంగులం

గోల్కొండ ఫతేదర్వాజ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి పురవీధుల్లో చేపట్టిన బైకు ర్యాలీలో కార్వాన్‌ ఎంఐఎం అభ్యర్థి కౌసర్‌


ఏక్‌ దక్కా.. హ్యాట్రిక్‌ పక్కా

ఆకాశ్‌పురి నుంచి బైకు ర్యాలీలో గోషామహల్‌ భాజపా అభ్యర్థి, ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ్‌


ఆల్‌ ద బెస్ట్‌ అక్బర్‌

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకాల ఆశీస్సులు అందుకున్న మలక్‌పేట అభ్యర్థి షేక్‌ అక్బర్‌


అభిమానం.. అతిథికి సత్కారం

రాంగోపాల్‌పేటలో నిర్వహించిన సభలో సనత్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కోట నీలిమ, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌లను గజమాలలతో కార్యకర్తలు సత్కరించారు.


బస్సులో వచ్చినా కారుకే మీ బాసట

నందివనపర్తి నుంచి యాచారం వరకు నిర్వహించిన రోడ్‌ షోలో బస్సు ప్రయాణికులకు అభివాదం చేస్తున్న ఇబ్రహీంపట్నం భారాస అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి


నేను అంజన్‌.. అభిమానం అదిరెన్‌

చిక్కడపల్లి, కవాడీగూడల్లో ప్రచారంలో కార్యకర్తలు అందించిన గదతో ముషీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అంజన్‌ కుమార్‌యాదవ్‌


అంబర్‌పేట.. కమలానిదే కోట

అంబర్‌పేట భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్‌ బాగ్‌అంబర్‌పేటలో పాదయాత్రగా ర్యాలీకి హాజరయ్యారు.


నీది కాంగ్రెస్‌.. నాది కాంగ్రెస్‌

ఊర్లు వేరు.. కానీ ఇద్దరిదీ ఒకే పార్టీ.. ఒకే తరహా ప్రచారం.. ఇంకేముంది మల్లేపల్లిలో తారసపడిన స్థానిక యువకుడు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వృద్ధుడు ఇలా ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు.


అదిరే బుల్లెట్టు.. అరెకపూడి హిట్టు

శేరిలింగంపల్లి భారాస అభ్యర్థి అరెకపూడి గాంధీ వివేకానంద నగర్‌ కాలనీ నుంచి నుంచి ర్యాలీ నిర్వహించగా కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


ఆదరించండి.. అభయ హస్తమిది

అంబర్‌పేటలో నిర్వహించిన మోటార్‌ సైకిళ్ల ర్యాలీలో కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిణ్‌రెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేశ్‌, ఇతర నేతల అభివాదం


నమ్మండి.. మనదే గెలుపు బండి

పాతబోయిన్‌పల్లిలో రోడ్‌షోలో పాల్గొన్న  కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి బండి రమేశ్‌, ఇతర నేతల అభివాదం


ఇక విజయమే.. వీర కిశోరమే!

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల బైకు ర్యాలీని ప్రారంభిస్తున్న గోషామహల్‌ భారాస అభ్యర్థి నందకిశోర్‌ వ్యాస్‌


ఈ తరం మహిళలం.. మాదే విజయం

మిర్జాలగూడ నుంచి ఆల్వాల్‌ వరకు స్వయంగా జీపు నడుపుతూ మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఎన్‌.రాంచందర్‌రావు ర్యాలీలో పాల్గొన్న మహిళలు


భారాస.. నా శ్వాస

తన ద్విచక్ర వాహనాన్ని పార్టీ జెండాలతో ముస్తాబు చేసి మల్కాజిగిరి భారాస అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డికి మద్దతుగా మిర్జాలగూడలో ర్యాలీలో పాల్గొన్న అభిమాని


ఓటెయ్‌.. ప్రజాస్వామ్యానికి బాటెయ్‌

ఓటు హక్కు వినియోగంపై కాలనీలు, బస్తీల్లో చైతన్యం ఉట్టిపడుతోంది. తూర్పు ఆనంద్‌బాగ్‌ డివిజన్‌లోని సీఫెల్‌ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్లకార్డులతో ప్రచారం చేపట్టారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని