logo

సైలెంట్‌ ఓటింగ్‌పై గంపెడాశలు!

మరికొన్ని గంటల్లోనే పోలింగ్‌ జరగనుండటంతో చివరి ప్రయత్నాల్లో పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ప్రధానంగా సైలెంట్‌ ఓటింగ్‌పై పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే జాతీయ, రాష్ట్ర నేతలు ఆయా నియోజకవర్గాల్లో సభలు, కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోలు నిర్వహించారు. ముఖ్యంగా మిగతా తెలంగాణతో పోలిస్తే గ్రేటర్‌లో భిన్న వాతావరణం ఉంటుంది.

Published : 29 Nov 2023 05:22 IST

తమకంటే తమకే అంటున్న పార్టీలు

రికొన్ని గంటల్లోనే పోలింగ్‌ జరగనుండటంతో చివరి ప్రయత్నాల్లో పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ప్రధానంగా సైలెంట్‌ ఓటింగ్‌పై పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే జాతీయ, రాష్ట్ర నేతలు ఆయా నియోజకవర్గాల్లో సభలు, కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోలు నిర్వహించారు. ముఖ్యంగా మిగతా తెలంగాణతో పోలిస్తే గ్రేటర్‌లో భిన్న వాతావరణం ఉంటుంది. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివాసముంటారు. ఉత్తరాది వాసులు ఎక్కువున్న నియోజకవర్గాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన వారున్న నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం చేశాయి. ఆయా ప్రాంతాల్లో ఓటర్ల మద్దతు తమకంటే తమకే అనే నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా శివార్లలో అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీలు ఎక్కువ. ఇక్కడ ఓటర్ల నాడి పట్టడం కష్టంగా మారింది. ముఖ్యంగా సైలెంట్‌ ఓటింగ్‌ కీలకంగా మారనుంది. ఇది ఏ పార్టీకి మళ్లితే అదే బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బస్తీలు ఇతర ప్రాంతాల్లో డబ్బు, మద్యం పంపకాలకు తెరతీశారు. అపార్ట్‌మెంట్ల అసోషియేషన్ల ప్రతినిధులతో పార్టీ నేతలను మాట్లాడించి, వారి సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని