logo

న్యాయమైన పాలన కాంగ్రెస్‌తోనే

న్యాయమైన పాలనతో ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు చేరువ చేసే కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ పిలుపునిచ్చారు.

Updated : 29 Nov 2023 06:13 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: న్యాయమైన పాలనతో ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు చేరువ చేసే కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ పిలుపునిచ్చారు. సనత్‌నగర్‌ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ కోట నీలిమకు మద్దతుగా మంగళవారం రాంగోపాల్‌పేట్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్య అతిది గెహ్లోత్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హైదరాబాదీ కుమార్తె, రాజస్థానీ కోడలు అయిన నీలిమకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు.

భారీ ర్యాలీ: కాంగ్రెస్‌ ప్రచార ముగింపులో భాగంగా రాంగోపాల్‌పేట్‌లోని కిమ్స్‌ వద్ద నుంచి భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. డాక్టర్‌ నీలిమ మాట్లాడుతూ.. గుండాగిరి, రౌడీయిజం నశించాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలపునిచ్చారు.


చైతన్యం అంతే.. అవగాహన అంతంతే..
ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల షెడ్యూలు ప్రారంభం నుంచి ఓటు హక్కు వినియోగం వరకూ ఓటర్లను పోలింగ్‌ బూత్‌ వరకూ తీసుకువెళ్లేలా చైతన్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన ఎన్నికల అధికారులు వాటిపై ఏమాత్రం దృష్టి సారించలేదు. ప్రతిసారి ఎన్నికల్లో గ్రేటర్‌లో సగటు ఓటింగ్‌ శాతం 60శాతం కూడా దాటడం లేదు. ఇలాంటి తరుణంలో అవసరమైన ఓటర్ల చైతన్య కార్యక్రమాలు మొక్కుబడి తంతుగా జరిగాయి. ఓటరు అవగాహన సదస్సులు కచ్చితంగా నిర్వహించాలన్న నిబంధనలను గుర్తుకు తెచ్చుకున్న కొందరు అధికారులు మాత్రం వారి పరిధిల్లో నాలుగైదు పాఠశాలల విద్యార్థులను పిలిపించి ర్యాలీలు నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఓటర్లకు తెలుస్తుందిలే అన్నధోరణిలో చేతులు దులిపేసుకున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని