logo

బయటకు రండి.. ఓటేయండి

‘‘హైదరాబాద్‌ ప్రజలు శాంతి ప్రేమికులు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే నగరంలో కేవలం 40-50 శాతం ఓటింగ్‌ నమోదవుతుంది.

Updated : 29 Nov 2023 06:51 IST

నగర కొత్వాల్‌ సందీప్‌ శాండిల్య పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘హైదరాబాద్‌ ప్రజలు శాంతి ప్రేమికులు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే నగరంలో కేవలం 40-50 శాతం ఓటింగ్‌ నమోదవుతుంది.ఓటర్లు బాధ్యతగా బయటకువచ్చి ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి’’ అని నగర పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య కోరారు. ఈ నెల 30న పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా చర్యలు తదితర అంశాలపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 666: నగర పరిధిలోని 1700 పోలింగ్‌ కేంద్రాల్లో 666 సమస్యాత్మకమైనవి. ప్రతి చోట ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు అనుకూల వాతావరణం ఉండేలా చర్యలు తీసుకున్నాం. 40 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద సీసీ టీవీ కెమెరాల నిఘా ఉంది. నగర వ్యాప్తంగా 21 మంది పరిశీలకులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్‌ పికెటింగ్‌, క్యూఆర్టీ బృందాలు ఉన్నాయి. 370 మొబైల్‌ యూనిట్లు విధుల్లో ఉన్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద తలెత్తే నేర సంఘటనలను ప్రజలు డయల్‌ 100 ద్వారా సమాచారమివ్వాలి.

రౌడీషీటర్లపై రోజూ నిఘా: నగరంలోని ఏడు జోన్లలో 1600 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వీరిపై స్థానిక పోలీసులు పూర్తి నిఘా ఉంచారు. వాహన తనిఖీలు ముమ్మరం చేశాం.

ఇప్పుడే కీలకం: పోలింగ్‌కు ముందు, ఆ రోజు  చాలా కీలకం. పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు, అక్రమాలకు పాల్పడినా వెంటనే చర్యలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు