logo

అమ్మో.. నవంబరు 30

ఎన్నికల రోజు సమీపించడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.. ఇన్నాళ్లు ప్రచారం నిర్వహించినా నియోజకవర్గంలో అప్పటి వరకు పలకరించని ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారోనని ఆందోళన చెందుతున్నారు.

Published : 29 Nov 2023 05:27 IST

అభ్యర్థుల గుండెల్లో హడల్‌

ఎన్నికల రోజు సమీపించడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.. ఇన్నాళ్లు ప్రచారం నిర్వహించినా నియోజకవర్గంలో అప్పటి వరకు పలకరించని ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారోనని ఆందోళన చెందుతున్నారు. ఇంటింటి ప్రచారం, మహిళా, యువజన సంఘాలు, సామాజిక వర్గాలవారీగా ప్రత్యేక సమావేశాలు, అపార్ట్‌మెంట్‌లు, కాలనీ సంక్షేమ సంఘాల్లో ప్రచారం సాగించినా.. ఇంకా పర్యటించాల్సిన ప్రాంతాలు మిగిలి ఉండటంతో తక్కువ సమయంలో వారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలని ఆందోళన చెందుతున్నారు. గంపగుత్తగా పడే ఓటు బ్యాంకును తమ గుప్పిట్లో పెట్టుకున్నా.. చీలిపోయే ఓట్లు, తటస్థుల మనోగతం ఏంటో తెలియక తికమకపడుతున్నారు.చివరి అంకంలో పోల్‌ మేనేజ్‌మెంట్‌కు ఖర్చు సైతం తడిసి మోపెడయ్యేలా ఉండటం, గెలుపు అవకాశాలు దోబూచులాడుతుండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తామింకా కలవని ఓటర్లును తమవైపు తిప్పుకోవడమనేది వారికి సవాల్‌గా మారింది.

ఈనాడు, హైదరాబాద్‌


డబ్బు పంచారని ఫిర్యాదు

ఫిలింనగర్‌: జూబ్లీహిల్స్‌లో డబ్బు పంపిణీ చేస్తున్నారంటూ ఎంఐఎం నేతలు ఫిర్యాదుచేశారు. మంగళవారం సాయంత్రం అజహరుద్దీన్‌ షేక్‌పేట బృందావన్‌కాలనీలో ఓ ఇంటికి వెళ్లారు. గమనించిన ఎంఐఎం నేతలు.. కాంగ్రెస్‌ అభ్యర్థి డబ్బు పంచుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి తనిఖీలు చేసి ఆయన సాధారణంగానే వచ్చినట్లు తేల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని