logo

గంపగుత్త ఓట్లకు కాలం చెల్లు

ఇదీ.. ఓటు ఎవరికి వేస్తావని నగరంలోని పలువురిని అడిగితే వచ్చిన సమాధానం. ఓటర్లపై గతంలో మాదిరి.. బస్తీ నాయకుడో, చోటామోటా నాయకుల ప్రభావమో అంతగా కనిపించడంలేదు.

Updated : 29 Nov 2023 06:50 IST

ప్రభావం చూపలేక పోతున్న స్థానిక నేతలు

ప్రశ్న: అమ్మా.. మీ ఓటెవరికి?
సమాధానం: నేను చెప్పను బిడ్డా.. ఎవరికో ఒకరికి ఓటేయాలి కదా..!
ప్రశ్న: మీ బస్తీ నాయకులు ఎవరికి వేయమని అంటున్నారు ?
సమాధానం: మా ఇష్టమొచ్చినోళ్లకు వేస్తాం.

ఇదీ.. ఓటు ఎవరికి వేస్తావని నగరంలోని పలువురిని అడిగితే వచ్చిన సమాధానం. ఓటర్లపై గతంలో మాదిరి.. బస్తీ నాయకుడో, చోటామోటా నాయకుల ప్రభావమో అంతగా కనిపించడంలేదు. వారు చెబితే మొత్తం ఓట్లన్నీ గంపగుత్తగా మనకే పడతాయనే నమ్మకాలు లేవిప్పుడు. బస్తీ, కాలనీ నేతలు, సంఘాల ప్రతినిధులు.. ఫలానా పార్టీకే ఓటేయాలని హుకుం జారీచేసే రోజులు పోయాయి.

పటిష్ఠ నాయకత్వం లేకే..

గతంలో చాలా మంది నాయకులు నిస్వార్థంగా పనిచేస్తూ తమ బస్తీకి, కాలనీవారికి సంక్షేమ పథకాలందేలా చూసేవారు. ఇప్పుడు చాలా మంది స్థానిక నేతలు.. తన మన అనే తేడాలేకుండా..పథకమేదైనా అందినకాడికి డబ్బు గుంజుతున్నారు. దీంతో వారు ఓటర్లను ప్రభావితం చేసే స్థాయిని కోల్పోయారు. బెదిరించే పరిస్థితులూ లేవు.
ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని