logo

ఓటరు ముంగిటకే మద్యం!

ఎన్నికల సందర్భంగా రాజధానిలో మద్యం పంపిణీ రికార్డులు బద్ధలవుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు పంపిణీ చేస్తూనే.. భారీగా మద్యం కూడా పంచుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు కొందరు మద్యం కోసమే రూ.3 నుంచి రూ.5 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు సమాచారం.

Published : 29 Nov 2023 05:34 IST

ప్రధాన పార్టీల అభ్యర్థుల భారీ వ్యయం

ఫిలింనగర్‌లో తాళం వేయని వైన్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల సందర్భంగా రాజధానిలో మద్యం పంపిణీ రికార్డులు బద్ధలవుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు పంపిణీ చేస్తూనే.. భారీగా మద్యం కూడా పంచుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు కొందరు మద్యం కోసమే రూ.3 నుంచి రూ.5 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు సమాచారం. శివారులోని అరడజను నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు కలిపి రూ.10 కోట్లకు పైగా కేవలం మద్యం కోసమే ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తంగా రాజధాని పరిధిలోనే రూ.150 కోట్లకు మించి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బెల్టు షాపుల నుంచే..

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, అబ్కారీ అధికారులు నగరంలొ బెల్టుషాపులను మూసేయించినా.. ఎక్కడికక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. బస్తీలు, గల్లీలు, కాలనీల్లో వేలాదిగా ఉన్న ఈ దుకాణాల్లో మద్యం నిల్వ చేసి పంపిణీకి తెరలేపారు. రెండ్రోజులుగా ఓటర్లకు పంపిణీ మొదలుపెట్టారు. ద్విచక్ర వాహనాలపై, కొన్నిచోట్ల మహిళల ద్వారా ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నారు. కొన్నిచోట్ల ఇంట్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా బాటిళ్లు ఇస్తున్నారు. డివిజన్‌ స్థాయి నేతలు అక్కడి ఉంచి కాలనీలు, బస్తీల్లోని అనుచరుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల సంఘం, పోలీసులు, అబ్కారీ శాఖ తనిఖీల నేపథ్యంలో నేతలు వేర్వేరు ప్రాంతాల్లో నిల్వ చేసి పంపిణీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని