logo

ఓటు ఆస్ట్రేలియాలో వేయకుంటే నేరం

ఆస్ట్రేలియాలో ఓటు వేయకుంటే నేరంగా పరిగణిస్తారు. వారంలోగా విచారించి జరిమానా విధిస్తారు. ఇక్కడ 96శాతం పోలింగ్‌ నమోదవుతోంది

Published : 30 Nov 2023 04:17 IST

యాచారం, న్యూస్‌టుడే: ఆస్ట్రేలియాలో ఓటు వేయకుంటే నేరంగా పరిగణిస్తారు. వారంలోగా విచారించి జరిమానా విధిస్తారు. ఇక్కడ 96శాతం పోలింగ్‌ నమోదవుతోంది. గ్రీస్‌లో ఓటు వేయకుంటే పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిలిపేస్తారు. ప్రభుత్వం నుంచి పొందే రాయితీలపై ఆంక్షలు విధిస్తారు. సింగపూర్‌లో ఓటు వేయడం తప్పనిసరి. అమెరికాలో ఓటు వేయడంపై ఎలాంటి ఆంక్షలు లేవు.. అయినా అక్కడ 70శాతం మేర ఓటింగ్‌ శాతం నమోదవుతోంది. పోలింగ్‌ రోజున సెలవు ఉండదు.

 

 

ఓటరుకు ప్రతిజ్ఞ ఉంది.. దేశంలో 2011లో ఓటరు దినోత్సవం ప్రారంభమైంది. ఏటా జనవరి 25న దీన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికైన నాయకులు చేసే విధంగానే ఓటర్లకు కూడా ప్రతిజ్ఞ ఉంది. ‘‘ప్రజాస్వామ్యంలో విశ్వసనీయతకు కట్టుబడిన భారత పౌరులమైన మేము.. మా దేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలు, స్వేచ్ఛ, న్యాయమైన, శాంతియుత, ఎన్నికల గౌరవాన్ని నిలిపి ఉంచుతామని.., ఎన్నికల్లో నిర్భయంగా.. మతం, వర్గం, కులం, సంఘం తదితర ప్రలోభాలను పరిగణనలోకి తీసుకోకుండా వాటికి గురికాకుండా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.’’ అనేది ఓటరు ప్రతిజ్ఞ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని