logo

రీ పోలింగ్‌కు ఆస్కారం ఇవ్వొద్దు: కలెక్టర్‌

జిల్లాలో రీపోలింగ్‌కు ఆస్కారం లేకుండా సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి సూచించారు. బుధవారం స్థానిక మేరీ-ఎ-నాట్స్‌ పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీని సాధారణ ఎన్నికల పరిశీలకులు సుధాకర్‌తో కలిసి పరిశీలించి మాట్లాడారు

Published : 30 Nov 2023 04:20 IST

మాట్లాడుతున్న నారాయణరెడ్డి, చిత్రంలో అదనపు కలెక్టర్‌, శిక్షణ కలెక్టర్‌ తదితరులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి: జిల్లాలో రీపోలింగ్‌కు ఆస్కారం లేకుండా సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి సూచించారు. బుధవారం స్థానిక మేరీ-ఎ-నాట్స్‌ పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీని సాధారణ ఎన్నికల పరిశీలకులు సుధాకర్‌తో కలిసి పరిశీలించి మాట్లాడారు. వివిధ శాఖల అధికారులు అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు. ఉదయం 5.30 గంటలకు కచ్చితంగా మాక్‌ పోలింగ్‌ను నిర్వహించాలని తెలిపారు. అనంతరం వీవీ ప్యాట్‌ల నుంచి చీటీలు తొలగించి మాక్‌ పోలింగ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలన్నారు. ఉదయం 7 గంటలకు తప్పనిసరిగా పోలింగ్‌ను ప్రారంభించాలని చెప్పారు.   కార్యక్రమంలో రిటర్నింగ్‌ అధికారులు రాహుల్‌శర్మ, శిక్షణ కలెక్టర్‌ అమిత్‌ నారాయణ, స్వీప్‌ నోడల్‌ అధికారి మల్లేశం, పంచాయతీరాజ్‌ ఈఈ ఉమేష్‌, జడ్పీ డిప్యూటీ సీఈఓ సుభాషిణి, సహాయ రిటర్నింగ్‌ అధికారులు లక్ష్మీ నారాయణ, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఉద్యోగులకు సూచించారు. బుధవారం పరిగిలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. పోలింగ్‌ సామగ్రిని తీసుకువెళ్లిన వెంటనే కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలను సమకూర్చుకోవాలని చెప్పారు. నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి విజయకుమారి, జిల్లా యువజన అధికారి హనుమంతరావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబు మోజస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని