logo

కమాండ్‌ కంట్రోల్‌ రూంల ఏర్పాటు

శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, బూత్‌లలో అమర్చిన వెబ్‌ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల్లో కమాండ్‌ కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేశారు.

Published : 30 Nov 2023 04:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, బూత్‌లలో అమర్చిన వెబ్‌ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల్లో కమాండ్‌ కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం అర్ధరాత్రి వరకూ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని సీసీ కెమెరాలు, వెబ్‌ కెమెరాలు చిత్రీకరించనున్నాయి. వాటన్నింటినీ కలెక్టర్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. సెక్టోరియల్‌ అధికారులు పోలింగ్‌ కేంద్రాల నుంచి మాక్‌ పోలింగ్‌, పోలింగ్‌ శాతం, క్యూ లైన్‌ వివరాల  సమాచారాన్ని ఈ కంట్రోల్‌ రూమ్‌కు పంపిస్తారని అధికారులు తెలిపారు. వారు సకాలంలో పంపించని పక్షంలో సంబంధిత సెక్టార్‌ కార్యాలయానికి ఫోన్‌ చేసి సమాచారాన్ని సేకరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని