logo

థర్మకోల్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

మరమ్మతులు చేస్తుండగా వచ్చిన నిప్పురవ్వలతో ఓ పరిశ్రమ దగ్ధమైన సంఘటన గగన్‌పహాడ్‌ పారిశ్రామికవాడలో బుధవారం చోటుచేసుకుంది. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు.

Published : 30 Nov 2023 04:43 IST

గోదాంను కమ్మేసిన పొగ

శంషాబాద్‌, న్యూస్‌టుడే: మరమ్మతులు చేస్తుండగా వచ్చిన నిప్పురవ్వలతో ఓ పరిశ్రమ దగ్ధమైన సంఘటన గగన్‌పహాడ్‌ పారిశ్రామికవాడలో బుధవారం చోటుచేసుకుంది. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్జున్‌ అనే వ్యాపారి ఇక్కడ  థర్మకోల్‌ తయారీ కంపెనీ నిర్వహిస్తున్నారు. కార్మికులతో వెల్డింగ్‌ చేయిస్తుండగా నిప్పురవ్వలు ఎగిసి థర్మాకోల్‌ తయారీ సామగ్రిపై పడటంతో మంటలు చెలరేగాయి. రూ.లక్షల విలువైన సామగ్రి బూడిదైంది.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు