logo

అమెరికాలో ప్రలోభాలకు తావు లేదు

ఓటు వేయాలని అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారు.. కొందరికి డబ్బులు వచ్చాయని.. అందని వారు తమకెందుకు ఇవ్వరని ఓటర్లు ఏకంగా ధర్నాలే చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎన్నికల ప్రచారం చేసేందుకు హైదరాబాద్‌ వచ్చిన ప్రవాస భారతీయలను ఒకింత విస్మయానికి గురి చేస్తున్నాయి.

Published : 30 Nov 2023 04:45 IST

 ప్రవాస భారతీయుడి మనోగతం

ఈనాడు, హైదరాబాద్‌: ఓటు వేయాలని అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారు.. కొందరికి డబ్బులు వచ్చాయని.. అందని వారు తమకెందుకు ఇవ్వరని ఓటర్లు ఏకంగా ధర్నాలే చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎన్నికల ప్రచారం చేసేందుకు హైదరాబాద్‌ వచ్చిన ప్రవాస భారతీయలను ఒకింత విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒక అభ్యర్థి తరఫున ప్రచారంలో భాగస్వామ్యం అయ్యేందుకు అమెరికా నుంచి ఎన్‌ఆర్‌ఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీధర్‌ పుప్పలి హైదరాబాద్‌ వచ్చారు. అమెరికాలో పలు ఎన్నికలను చూసిన ఆయన అక్కడి విషయాలను పంచుకున్నారు.

 ప్రతి డాలర్‌కు లెక్క చూపాల్సిందే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా అమెరికాలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న నేను.. అక్కడి రాజకీయాలను దగ్గరి నుంచి చూశాను. అభ్యర్థులు గెలిచిన తర్వాత ఏం చేస్తారనే దానిపై ప్రధానంగా చర్చ ఉంటుంది. వారి అభిప్రాయాలను వెల్లడించేందుకు వేదికలను కల్పిస్తారు. ‘కాఫీ విత్‌ ద లీడర్‌’ అనే కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యల గురించి  ప్రజలు ప్రశ్నిస్తారు. వారిచ్చే జవాబులు, వారి వద్ద ఉన్న ప్రణాళికలు, ఆలోచనలను బట్టి ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారు. పార్టీలకు, అభ్యర్థులకు విరాళాలిచ్చినా లెక్కలు చూపించాల్సిందే. ఖర్చు చేసే ప్రతి డాలర్‌ వారికి ఎవరిచ్చారనే లెక్క పక్కాగా ఉంటుంది. ఎందుకిచ్చారో కూడా వివరించాల్సి ఉంటుంది.  మన దగ్గర అభ్యర్థులు అభివృద్ధి పనులు ఏం చేస్తారని, ఎలా చేస్తారని ఓటర్లు అడగట్లేదు. ప్రలోభాలకు గురిచేసే పరిస్థితులు మారితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు