logo

పార్కిన్‌సన్స్‌ రోగులకు నిమ్స్‌లో ప్రత్యేక చికిత్స

పార్కిన్‌సన్స్‌ రోగుల కోసం నిమ్స్‌లో ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నట్లు నిమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ బీరప్ప చెప్పారు. జన్యుపరమైన లోపాలు, ఇతర కారణాలతో శరీర కదలికల్లో మార్పులతో చాలామంది అవస్థలు పడుతున్నారన్నారు.

Updated : 30 Nov 2023 05:23 IST

అవగాహన నడకలో నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప, న్యూరాలజీ వైద్యులు

ఈనాడు,హైదరాబాద్‌: పార్కిన్‌సన్స్‌ రోగుల కోసం నిమ్స్‌లో ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నట్లు నిమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ బీరప్ప చెప్పారు. జన్యుపరమైన లోపాలు, ఇతర కారణాలతో శరీర కదలికల్లో మార్పులతో చాలామంది అవస్థలు పడుతున్నారన్నారు. బుధవారం ఆస్పత్రిలో ‘ప్రపంచ మూవ్‌మెంట్‌ డిజార్డర్‌’ సందర్భంగా నిర్వహించిన అవగాహన నడకలో పాల్గొని మాట్లాడారు. ఈ వ్యాధి పుట్టుకతో కొంతమందికి వస్తే మరికొంతమందికి వృద్ధాప్యంలో వస్తుందన్నారు. అలాంటి వ్యాధులను గుర్తించేందుకు ఆస్పత్రిలో న్యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో న్యూరాలజీ విభాగాధిపతి అప్షన్‌ జబీన్‌, వైద్యులు సూర్యప్రభ, శిరీష, భవాణి, మహేశ్‌, పీఆర్‌వో సత్యాగౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని