logo

కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌పై కేసు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌తోపాటు మరో ఆరుగురిపై ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది

Updated : 30 Nov 2023 05:33 IST

ఫిల్మ్‌నగర్‌, న్యూస్‌టుడే: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌తోపాటు మరో ఆరుగురిపై ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.   జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌ మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో టోలిచౌకి బృందావన్‌ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌లో మహ్మద్‌ ఖలీల్‌, సయ్యద్‌ అఫ్రోజ్‌, మహ్మద్‌ సల్లాఉద్దీన్‌, షౌకర్‌ అలీ, ఖాన్‌, సయ్యద్‌ రషీద్‌ హుస్సేనీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది అభిషేక్‌ తివారి ఫిర్యాదుతో అజారుద్దీన్‌తోపాటు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎ.గణేష్‌గౌడ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని